ఓవైపు క్రికెట్ మ్యాచ్.. మరోవైపు లవ్ ప్రపోజల్.. వీడియో

Sun,July 15, 2018 12:09 PM

A Marriage Proposal during India vs England match at Lords

లండన్: క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ గ్రౌండ్‌లో శనివారం జరిగిన ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్ కంటే ఎక్కువగా.. మరో సీన్ గ్యాలరీలోని ప్రేక్షకులతోపాటు ప్లేయర్స్, కామెంటేటర్స్, టీవీల ముందు కూర్చున్న కోట్లాది మంది వ్యూవర్స్ దృష్టిని ఆకర్షించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 24వ ఓవర్లో ఆ ఘటన జరిగింది. ఓవైపు ఫీల్డ్‌లో రూట్, మోర్గాన్ రూపంలో ఇంగ్లండ్‌కు మంచి పార్ట్‌నర్‌షిప్ దొరికితే.. మరోవైపు గ్యాలరీలో ఓ ఇండియన్ జంట పెళ్లి కుదిరింది. చరణ్ గిల్ అనే ఆ అమ్మాయికి పవన్ బైన్స్ అనే అబ్బాయి గ్రౌండ్‌లోనే ప్రపోజ్ చేశాడు. దీనికి ఆమె కూడా వెంటనే ఓకే చెప్పింది. దీంతో స్టేడియమంతా చప్పట్లతో మార్మోగింది. గ్రౌండ్‌లో బౌలింగ్ చేస్తున్న చాహల్ కూడా చప్పట్లు కొడుతూ కనిపించాడు. ఈ లవ్ ప్రపోజల్‌కు కామెంటేటర్ డేవిడ్ లాయ్డ్ కామెంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం డెసిషన్ పెండింగ్‌లో ఉందంటూ సస్పెన్స్‌ను కొనసాగించిన అతను.. ఆమె ఎస్ చెప్పగానే ఎంతో ఉత్సాహంగా ఆ విషయాన్ని ప్రకటించాడు. స్కై స్పోర్ట్స్ క్రికెట్ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ కూడా మరో ట్వీట్‌లో ఈ జంట లవ్ ప్రపోజల్‌ను ప్రస్తావించింది.
7099
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles