సింపుల్ షాదీ.. వాళ్ల పెళ్లికి అయిన ఖర్చు 10 వేలే..!

Mon,December 24, 2018 07:06 PM

A 20000 Rupee Wedding This Man Simple Shaadi Is Winning Over Twitter

పెళ్లికి 10 వేలే ఖర్చయ్యాయంటే.. గుడిలోనో లేక రిజిస్టర్ మ్యారేజేమో అని అనుకోకండి. వాళ్లు సంప్రదాయ బద్ధంగానే.. బంధుమిత్రుల సమక్షంలోనే మంత్రోచ్ఛరణల మధ్య పెళ్లి చేసుకున్నారు. హంగూ ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా చేసుకున్నారు. పెళ్లికి వచ్చిన అతిథులకు కూడా ఎటువంటి లోటూ రాలేదు. వాళ్లకు బ్రహ్మాండమైన వంటకాలు పెట్టారు. కానీ.. వాళ్ల పెళ్లికి అయిన ఖర్చు మాత్రం 10 వేలే. ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా.పాకిస్థాన్‌కు చెందిన రిజ్వాన్ పెహెల్వానే ఈ పెళ్లి చేసుకున్నది. తన పెళ్లికి 10 వేలే ఖర్చయిందంటూ(పాకిస్థాన్ కరెన్సీ - 20 వేలు) ట్విట్టర్‌లో తన స్టోరీని షేర్ చేసుకున్నాడు. 10 వేల రూపాయలు కూడా ఎలా ఖర్చయ్యాయో.. పెళ్లికి వచ్చిన అతిథులకు ఏం పెట్టారో.. పెళ్లి ఎక్కడ జరిగిందో.. ఇలా.. తన పెళ్లి వేడుకలన్నింటినీ పూసగుచ్చినట్టు ట్విట్టర్‌లో షేర్ చేశాడు. మనోడి స్టోరీ నచ్చిన నెటిజన్లు.. వావ్.. నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి మిత్రమా. తక్కువ ఖర్చుతో భలేగా పెళ్లి చేసుకున్నావు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.


ఇంతకీ ఆయన సోషల్ మీడియాలో ఏం షేర్ చేసుకున్నాడంటే... నా పెళ్లికి గెస్టులు 25 మంది మాత్రమే. అందులోనే కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్ ఉన్నారు. నా పెళ్లి మా బిల్డింగ్ టెర్రస్ మీదనే జరిగింది. ఇక ఫుడ్ మెనూ అంటారా? చికెన్ టిక్కా, సీఖ్ కబాబ్, పతూరేయ్ చనాయ్ హల్వా స్ట్రాబెర్రీలు.. ఏది ఏమైనా నా పెళ్లి బడ్జెట్ మొత్తం 20 వేలు(పాకిస్థాన్ రూపీ) దాటకూడదనుకున్నా. చెఫ్‌లను ఓ ఫ్రెండ్ తీసుకొచ్చాడు. చికెన్, మసాలాలు షాపు నుంచి కొనుక్కొచ్చాం. నాకు కాబోయే శ్రీమతే స్టార్టర్లను వండింది. డెకరేషన్ లైట్లను మా నాన్న తీసుకొచ్చి టెర్రస్ మీద అలంకరించాడు.


పక్కనే ఉన్న ఎలక్షన్ కమిటీ హాల్ నుంచి 25 కుర్చీలు రెంట్‌కు తీసుకొచ్చా. నా ఫ్రెండ్ స్ట్రాబెర్రీలు, ఐస్‌క్రీమ్ తీసుకొచ్చాడు. ఫుడ్ సర్వ్ చేయడానికి టేబుల్స్ కూడా నా ఫ్రెండే తీసుకొచ్చాడు. ఇక నా పెళ్లికి నేను, నా భార్య సల్వార్ కమీజ్ వేసుకున్నాం. వాటిని నా పేరెంట్స్ మాకు గిఫ్ట్‌గా కొనిచ్చారు. అలా 20 వేల రూపాయల్లో మా పెళ్లి సూపర్బ్‌గా జరిగింది. ఈ స్టోరీ అంతా నేను షేర్ చేసుకోవడానికి ఒకటే రీజన్. నా పెళ్లికి తక్కువ ఖర్చు పెట్టినా.. మేము చాలా ఆనందంగా, సంతోషంగా మా పెళ్లిని జరుపుకున్నాం. అందుకే.. మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి. అకేషన్ చిన్నదా పెద్దదా? డబ్బులు ఉన్నాయా లేదా? అది కాదు ముఖ్యం. మనం ఎంత సంతోషంగా ఇన్వాల్వ్ అయి వేడుకలు జరుపుకుంటున్నామన్నదే ముఖ్యం.. అంటూ తన పెళ్లికి సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేసి సెలవు తీసుకున్నాడు రిజ్వాన్.

7958
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles