ఇమ్రాన్‌ ప్రమాణానికి వెళ్లే భార‌త క్రికెట‌ర్లు వీళ్లే..!

Fri,August 10, 2018 07:26 PM

92 champions invited to oath-taking ceremony

ఇస్లామాబాద్: పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ మరొకొద్ది రోజుల్లో పాకిస్థాన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ నేతృత్వంలోని పీటీఐ అత్యధిక స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత లెజండరీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గావస్కర్‌తో పాటు నవజ్యోత్ సింగ్ సిద్దూనూ కూడా ఆహ్వానించినట్లు పీటీఐ వెల్లడించింది. వీళ్లతో పాటు ఇమ్రాన్ కెప్టెన్సీలో 1992 ప్రపంచకప్ విజేతగా నిలిచిన పాక్ జట్టులో ఉన్న ఆటగాళ్లను కూడా కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆగస్టు 18న ఇమ్రాన్ ఖాన్ పాక్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మరోవైపు ఈ కార్యక్రమానికి భారత క్రికెటర్లు, సెలబ్రిటీలను కూడా ఆహ్వానించనున్నట్లు పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్‌ ఛౌదరి గతంలో తెలిపిన విషయం తెలిసిందే.

మరోవైపు పాక్‌లో ఇండియన్ హైకమిషనర్ అజయ్ బిసారియా శుక్రవారం ఇమ్రాన్ ఖాన్‌ను కలిసి ఎన్నికల్లో మెజారిటీ సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీరిద్దరూ భారత్-పాక్ సత్సంబంధాలు, పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం భారత క్రికెట్ జట్టు సంతకాలు చేసిన ప్రత్యేక క్రికెట్ బ్యాట్‌ను ఇమ్రాన్‌కు బిసారియా అందజేశారు.

3673
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles