75 ఏండ్ల కింద దొంగతనం చేసి.. ఇప్పుడు సారీ చెప్పాడు!

Sat,June 23, 2018 06:53 PM

90 year old says sorry for stealing stop sign 75 years ago

75 ఏండ్ల కిందట ఓ వ్యక్తి... తను చేసిన దొంగతనానికి ఇప్పుడు క్షమాపణలు కోరాడు. ఈ ఘటన యూఎస్‌లోని టెక్సాస్‌లో చోటు చేసుకున్నది. 90 ఏండ్ల ఓ వ్యక్తి 75 ఏండ్ల కింద ట్రాఫిక్ సిగ్నల్‌గా ఉపయోగించే స్టాప్ సైన్ బోర్డ్‌ను ఎత్తుకెళ్లాడట. ఇక.. తను చేసిన తప్పును సరిదిద్దుకుందామనుకున్నాడో ఏమో కాని.. లేటైనా లేటెస్ట్‌గా తన తప్పును ఒప్పుకున్నాడు. అంతే కాదు తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా 50 డాలర్ల నోటును కూడా పెట్టి, అపాలజీ లెటర్ రాసి.. ఉటాహ్ అనే సిటీలో ఉన్న మిడ్‌వాలె పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు పోస్ట్ చేశాడు. ఇక.. ఈ లెటర్‌ను డిపార్ట్‌మెంట్ తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఆ లెటర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆ వ్యక్తి గొప్పతనానికి మురిసిపోయిన డిపార్ట్‌మెంట్ అధికారులు.. అతడిని పర్సనల్‌గా కలుద్దామనుకున్నా అతడి ఐడెంటిటీ ఏం లేకుండా లెటర్ పంపించడంతో అతడి పేరు, అడ్రస్ కనుక్కోలేకపోయారు. తనకు తాను క్షమించుకొని మిగితా జీవితం ఆనందంగా గడిపితే చాలు.. అంటూ డిపార్ట్‌మెంట్ అధికారులు పేర్కొన్నారు.

5847
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles