శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు.. 138 మంది మృతి

Sun,April 21, 2019 11:57 AM

52 Dead In Multiple Blasts In Sri Lanka's Churches and Hotels

కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో చోటుచేసుకున్న వరుస బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు 138 మంది మృతిచెందారు. 402 మంది వ్యక్తులు గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో 13 మంది విదేశీయులు ఉన్నట్లుగా సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కొలంబోలోని కొచ్‌చికాడాలోని సెయింట్ ఆంథోని చర్చి, కథువాపితియాలోని సెయింట్ సెబాస్టియన్ చర్చి, బట్టికలోయ చర్చిల్లో అదేవిధంగా హోటల్ షాంగ్రిలా, సిన్నమాన్ గ్రాండ్, కింగ్స్ బరీ హోటల్స్‌లో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈస్టర్ సందర్భంగా ప్రార్థనలు చేస్తుండగా ఒక్కసారిగా బాంబు పేలుళ్లు సంభవించాయి. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలించారు. పోలీసు సిబ్బంది, ఆర్మీ బలగాలు ముఖ్య ప్రాంతాల్లో మోహరించాయి.

1303
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles