ఈ బ్రిడ్జిమీద నడవాలంటే ఒంట్లో టన్నుల కొద్దీ దమ్ముండాలి.. వీడియోMon,March 12, 2018 04:37 PM

ఈ బ్రిడ్జిమీద నడవాలంటే ఒంట్లో టన్నుల కొద్దీ దమ్ముండాలి.. వీడియో

అవును.. ఒంట్లో ట‌న్నుల కొద్దే కాదు... అంత కన్నా ఎక్కువ దమ్ము ఉండాలి ఈ బ్రిడ్జిపై నడవాలంటే. ఓ అమ్మాయి ముందు బాగానే దైర్యం చేసింది. కాని.. బ్రిడ్జి ఎక్కాక తనకు చుక్కలు కనిపించాయి. ఇక అంతే.. అక్కడే కూలబడింది. ముందుకు మాత్రం కదలట్లేదు. తనతో పాటు వచ్చిన మరో వ్యక్తి తనను నడవాలంటూ లాగాడు. అయినా కదలదే. మరి ఏమనుకున్నారు ఆ బ్రిడ్జిపై నడవాలంటే అంత ఈజీ కాదు. అయితే.. కొంతమంది డేర్ డెవిల్స్ మాత్రం ఆ బ్రిడ్జిపై అవలీలగా నడిచేస్తున్నారు. ఇంతకీ ఆ బ్రిడ్జి ఎక్కడ ఉందనేగా మీ ప్రశ్న.

అది చైనాలోని హునన్ ప్రావిన్స్‌లో ఉంది. డెహంగ్ గ్రాండ్ కన్యాన్ అనే కొండ మీద 500 మీటర్ల ఎత్తులో ఆ బ్రిడ్జిని నిర్మించారు. ఇంకో విశేషం ఏంటంటే.. అది మామూలు బ్రిడ్జి కాదు.. గ్లాసు బ్రిడ్జి. అంటే పారదర్శకంగా ఉంటుంది ఆబ్రిడ్జి. అందుకే దానిమీద నడవడానికి చాలా మంది దడుసుకుంటున్నారట. రీసెంట్‌గా ఓపెన్ అయిందట. చైనాలో ఇలాంటి గ్లాసు బ్రిడ్జీలకు కొదవే లేదు. ఇదివరకు చాలా బ్రిడ్జిలు ఇటువంటివి ఓపెన్ అయ్యాయి.

3511
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS