లిబియా తీరానికి కొట్టుకొచ్చిన 41 మృతదేహాలు

Tue,July 26, 2016 01:20 AM

41 bodies have been swept off the coast of Libya

-వలస వెళ్లేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోతున్న అభాగ్యులు
ట్రిపోలి, జూలై 25: లిబియాలోని తీరప్రాంత నగరమైన సబ్రతలో 41 మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చినట్టు అధికారులు సోమవారం తెలిపారు. వాటిని డీఎన్‌ఏ పరీక్ష కోసం మార్చురీకి తరలించామని చెప్పారు. ఐదారు రోజుల కింద వీరు నీట మునిగి ఉంటారని పేర్కొన్నారు. రోజూ ఒకటి లేదా రెండు మృతదేహాలు కొట్టుకొస్తాయని, కానీ ఈసారి ఏకంగా ఒకేరోజూ 41 మృతదేహాలు కొట్టుకొచ్చాయని చెప్పారు. మరణించిన వారు మనుషులను స్మగ్లింగ్ చేసే ముఠాల బాధితులై ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వేసవి కాలంలో మధ్యదరా సముద్రం ప్రశాంతంగా ఉంటుందని, ఈ సమయంలో స్మగ్లర్లు అక్రమంగా వలస వెళ్లాలనుకొనే వారిని చిన్నచిన్న పడవలలో తరలిస్తుంటారని చెప్పారు. చాలామంది ఐరోపా వెళ్లి కొత్త జీవితం ప్రారంభించాలనే ఆశతో బయల్దేరుతారని, కానీ కొందరు మధ్యలోనే నీట మునుగుతుంటారని అన్నారు. లిబియా నియంత మువమ్మర్ గడాఫీ పతనం అనంతరం దేశంలో అస్థిరత నెలకొనడంతో వలస వెళ్లే వారి సంఖ్య ఎక్కువైంది. చాలామంది లిబియా తీరానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇటలీని చేరుకొనేందుకు సముద్రమార్గంలో ప్రమాదకరమైన చిన్న పడవలలో బయల్దేరుతుంటారు. 2014 నుంచి ఇంతవరకు ఈ విధంగా వెళ్లిన పదివేల మందికి పైగా ప్రజలు మధ్యధరా సముద్రంలో మునిగిపోయారని ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్ వెల్లడించారు.

1991
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles