400 అడవి దున్నల మునకకు సింహాలే కారణమా?

Thu,November 8, 2018 03:50 PM

400 wild buffalos drowned due to lion chase

ఆఫ్రికాలో అడవిదున్నల మేధం జరిగింది. గాబరోన్, నమీబియా సరిహద్దు ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 400 దున్నలు పరుగులు తీశాయి. కొండ అంచుకు చేరుకున్నాయి. తొక్కిసలాటరిగింది. సుమారు 400 జీవాలు పక్కనే ఉన్న చోబే నదిలోకి వెళ్లిపడ్డాయి. ఇలా భారీ సంఖ్యలో దున్నలు మరణించడంపై అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరుగుతున్నది. సింహాలు తరుముకుంటూ రావడం వల్ల దున్నలు పరుగులు తీశాయని ప్రాథమిక సమాచారం. సింహాలు దున్నలను తరమడం, అవి తొక్కిసలాటకు గురికావడం కొత్త కాదు. కానీ ఇంత భారీ సంఖ్యలో జీవాలు నీటిలో కలిసిపోవడం మాత్రం అసాధారణమేనని వన్యప్రాణి నిపుణులు అంటున్నారు.

3072
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles