కివీస్ మ‌సీదుల్లో కాల్పులు.. 40 మంది మృతి

Fri,March 15, 2019 12:19 PM

40 confirmed dead in Christchurch mosque massacre

క్రైస్ట్‌చ‌ర్చ్: న్యూజిలాండ్‌లో రెండు మ‌సీదుల్లో జ‌రిగిన కాల్పుల్లో మొత్తం 40 మంది మృతిచెందారు. ఈ విషయాన్ని ఆ దేశ ప్ర‌ధాని జెసిండా ఆర్డెన్ ప్ర‌క‌టించారు. లిన్‌వుడ్ వ‌ద్ద ప‌ది మంది, డీన్ ఏవ్ మ‌సీదు వ‌ద్ద మ‌రో 30 మంది మృతిచెందారు. ఈ కాల్పుల ఘ‌ట‌న‌లో మ‌రో 27 మంది గాయ‌ప‌డ్డారు. ఇదో అసాధార‌ణ కాల్పుల ఘ‌ట‌న అని ప్ర‌ధాని జెసిండా అన్నారు. ఇది ఉగ్ర‌వాద చ‌ర్యే అని ఆమె తెలిపారు. ఈ కేసులో మొత్తం న‌లుగుర్ని అరెస్టు చేశారు. అందులో ఓ మ‌హిళ ఉన్న‌ది. అల్ నూర్ మ‌సీదు వ‌ద్ద జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌ను ఓ సాయుధుడు సుమారు 17 నిమిషాల పాటు వీడియో తీశాడు. క్రైస్ట్‌చ‌ర్చ్‌కు అద‌న‌పు బ‌ల‌గాల‌ను పంపిస్తున్న‌ట్లు ప్ర‌ధాని జెసిండా చెప్పారు.

1513
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles