తల్లిపై నాలుగేళ్ల బాలుడి కాల్పులు

Mon,February 4, 2019 01:49 PM

4 year old boy finds gun shoots pregnant mother in the face

సియాటెల్‌ : తన తల్లిపై ఓ నాలుగేళ్ల బాలుడు కాల్పులు జరిపాడు. ఈ సంఘటన వాషింగ్టన్‌లోని ఓ భవనంలో శనివారం చోటు చేసుకుంది. 27 ఏళ్ల మహిళ, ఆమె ప్రియుడు కలిసి టీవీ చూస్తున్నారు. ఈ క్రమంలో నాలుగేళ్ల కుమారుడు తన ఇంట్లో పరుపు కింద ఉన్న తుపాకీని తీసి తన తల్లిపై కాల్పులు జరిపాడు. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితె బాధితురాలు ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. బాలుడు కావాలని కాల్పులు జరపలేదని.. అనుకోకుండా ఈ సంఘటన చోటు చేసుకుందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

2717
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles