కొండచరియలు విరిగిపడి 31 మంది మృతి

Fri,October 12, 2018 01:48 PM

కంపాలా : ఉగాండాలో భారీ వర్షాలు కురిశాయి. పశ్చిమ ఉగాండాలో కుండబోత వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. బుడుడా జిల్లాలోని బుకాలసీ పట్ణణ నదీ తీర ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వర్షాలు, కొండచరియల ప్రభావంతో పరిసర ప్రాంతాల్లో బురదనీరు చేరుకుందని, ఐదు గ్రామాలపై ఈ ప్రభావం ఉందని విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ నాథన్ తుముహమ్యే తెలిపారు. వర్షాభావ ప్రాంతాల్లో సహాయక బృందాలను ప్రభుత్వం పంపించిందన్నారు.

702
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles