13 ఏనుగులు రైల్వేట్రాక్ దాటుతుండగా..

Sun,October 7, 2018 02:52 PM

3 elephants killed after hit by moving train in Sri Lanka

శ్రీలంక: వేగంగా వెళ్తున్న రైలు ఢీకొట్టడంతో మూడు ఏనుగులు మృతి చెందాయి. ఈశాన్య శ్రీలంకలోని వెలియోయా పరిధిలోని త్రికోణమడు- మధుర ఒయ అటవీప్రాంతంలో ఉన్న రైలు మార్గంలో ఈ ఘటన జరిగింది. 13 ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటుచేసుకుందని రైల్వే అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

శ్రీలంకలో ఏనుగులను జాతీయసంపదగా పరిగణిస్తారు. వాటికి చట్టపరమైన రక్షణ కూడా కల్పిస్తారు. శ్రీలంకలో ఏనుగుల సంఖ్య 8వేలు. గత నెలలో ఆయిల్ రవాణా చేస్తున్న రైలును ఢీకొట్టడంతో రెండు గున్నఏనుగులు వాటి తల్లి ఏనుగుల ప్రాణాలు విడిచాయి. వరుస ప్రమాదాల నేపథ్యంలో అటవీ ప్రాంతాల పరిధిలోని ట్రాక్‌ల వెంబడి ఏనుగులకు హెచ్చరికలు జారీ చేసేలా..హారన్ వేస్తూ నెమ్మదిగా తీసుకెళ్లాలని లోకోపైలట్లకు అధికారులు సూచించారు.

6198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles