ఆ సైనికుడి కడుపులో 27 సెంటీమీటర్ల పరాన్నజీవి..

Thu,November 23, 2017 03:24 PM

27 meter parasite found in North Korea defector soldier

సియోల్: ఇటీవల ఓ ఉత్తర కొరియా సైనికుడు ఆ దేశ డీమిలిటరీ జోన్‌లో గాయపడ్డ విషయం తెలిసిందే. ఓ వాహనంలో తప్పించుకునేందుకు ప్రయత్నించిన అతనిపై ఉత్తర కొరియా సైనికులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో గాయపడ్డ అతనికి దక్షిణ కొరియా డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. అయితే ఆ డిఫెక్టో సైనికుడి కడుపు నుంచి భారీ స్థాయిలో పరాన్నజీవులను డాక్టర్లు వెలికితీశారు. సైనికుడి కడుపులో ఉన్న పరాన్నజీవులను చూసి డాక్టర్లు స్టన్ అవుతున్నారు.

ఇంత పెద్ద, పొడువైన పరాన్న జీవులను తాము ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యపోతున్నారు. బుల్లెట్లు దిగిన సైనికుడికి చికిత్స చేస్తున్న సమయంలో పరాన్నజీవులు ఉన్నట్లు కనుగొన్నారు. పరాన్నజీవులు రకరకాలుగా ఉన్నాయని, ఓ పురుగు సుమారు 27 సెంటీమీటర్లు.. అంటే సుమారు 10 ఇంచులు ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా కుక్కల్లో ఉండే పరాన్నజీవులు ఆ సైనికుడి కడుపులో ఉన్నట్లు గుర్తించారు.

తన 20 ఏళ్ల సర్వీస్‌లో ఇలాంటి పురుగులను ఎప్పుడూ చూడలేని డాక్టర్ లీ కుక్ జాంగ్ తెలిపారు. కడుపులో ఉన్న నట్టలు, పురుగులను చూస్తే, ఉత్తర కొరియాలో ఎలాంటి దుర్భత పరిస్థితి ఉందో అర్థమవుతున్నదని నిపుణులు భావిస్తున్నారు. పట్టబడ్డ ఉత్తర కొరియా సైనికుడికి హెపిటైటిస్ బి కూడా ఉన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం సైనికుడి పేగుల నుంచి అన్ని పరాన్న పురుగులను తొలిగించినట్లు డాక్టర్లు తెలిపారు.

5656
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS