బస్సులో మంటలు : 26 మంది సజీవదహనం

Sat,March 23, 2019 09:56 AM

26 Killed as Bus Catches Fire On Highway In China

చైనా : సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 26 మంది సజీవదహనం కాగా, మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 53 మంది పర్యాటకులు, ఒక టూరిస్టు గైడ్‌తో పాటు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. డ్రైవర్లిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తడంతోనే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

877
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles