సౌదీ ఎయిర్‌పోర్ట్‌పై మిస్సైల్ దాడి

Wed,June 12, 2019 05:39 PM

26 injured as Houthi missile attack on Saudi airport

హైద‌రాబాద్‌: సౌదీ అరేబియాలోని ఓ విమానాశ్ర‌యంపై యెమెన్‌కు చెందిన హౌతి రెబ‌ల్స్ వైమానిక దాడులకు పాల్ప‌డ్డారు. ఆ మిస్సైల్‌ దాడితో 26 మంది పౌరులు గాయ‌ప‌డ్డారు. బుధ‌వారం ఉద‌యం అబా ఎయిర్‌పోర్ట్‌పై మిస్సైల్ అటాక్ జ‌రిగింది. ల‌క్ష్యాన్ని అత్యంత క‌చ్చితంగా పేల్చిన‌ట్లు హౌతి రెబ‌ల్స్ తెలిపారు. యెమెన్‌లో హౌతి రెబ‌ల్స్ నాలుగేళ్లుగా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాడుతున్నారు. అయితే ప్ర‌భుత్వానికి సౌదీ కూట‌మి దేశాలు స‌పోర్ట్ ఇస్తున్నాయి.

6798
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles