23 లక్షల విలువైన ఆర్ట్‌వ‌ర్క్‌ను ఎత్తుకెళ్లాడు.. వీడియో

Fri,June 15, 2018 07:48 PM

23 lakh worth Banksy Artwork Stolen From Exhibit in toronto

కెనడాలోని టొరంటోలో ఆర్ట్‌వర్క్ ఎగ్జిబిషన్ జరుగుతున్నది. అందులో బ్రిటన్‌కు చెందిన గ్రాఫిటీ ఆర్టిస్ట్ బాంక్సీ వేసిన ఆర్ట్స్‌ను కూడా ప్రదర్శించారు. అయితే.. బాంక్సీ వేసిన ఓ ఆర్ట్‌ను ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. దాదాపు 23 లక్షల విలువైన ఆ ఆర్ట్‌ను ఓ ముసుగు దొంగ ఎగ్జిబిషన్ లోనికి దూరి ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ట్రాలీ హంటర్స్ అనే ఆర్ట్ వర్క్ అది. 45 వేల కెనెడియన్ డాలర్ల విలువైన ఆ ఆర్ట్ వర్క్‌ను ఎత్తుకెళ్లడంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

ఆర్టిస్ట్ బాంక్సీకి చెందిన 80 రకాల ఆర్ట్‌లను ఈ ప్రదర్శనలో ఉంచారు. గత బుధవారం ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ జులై 11 వరకు కొనసాగనుంది.

2117
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles