
నేపాల్: కైలాస మానస సరోవర యాత్ర మార్గంలో చిక్కుకున్న భక్తులను కాపాడేందుకు రెండు విమానాలు సిమికోట్ ప్రాంతానికి చేరుకున్నాయి. సహాయక చర్యల్లో భాగంగా రెండు ప్రత్యేక వాణిజ్య విమానాలు సిమికేట్ ప్రాంతంలో ల్యాండయ్యాయి. వర్షాలకు కొండచరియలు విరిగిపడగా నేపాల్‌లోని సిమికోట్ ప్రాంతంలో 525 మంది యాత్రికులు, హిల్సా ప్రాంతంలో 550 మంది, టిబెట్ ప్రాంతంలో 500 మంది యాత్రికులు చిక్కుకున్నట్లు సమాచారం. సిమికోట్ , హిల్సా , టిబెట్ ప్రాంతంలో పరిస్థితిని భారత్, నేపాల్ రాయబార కార్యాలయం సమీక్షిస్తుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారగానే యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తామని..యాత్రలో చిక్కుకున్న వారికి వైద్య సదుపాయం, ఆహారం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. యాత్రలో చిక్కుకున్న భక్తుల సౌకర్యార్థం హాట్ లైన్లు ఏర్పాటు చేశారు.
నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయంలో హాట్లైన్లు ఏర్పాటు చేశారు. హాట్‌లైన్ నంబర్లు: 977-9851107006, 9851155007, 9851107021, 9818832398, వివిధ భాషల్లో సమాచారం తెలుసుకునేందుకు హాట్లైన్లు ఏర్పాటు చేశారు. తెలుగు - 977-9808082292, కన్నడ-977-9823672371, తమిళ్-977-9808500642, మళయాళం- 977-9808500644