ఫెయిల్ అయిన 1930 నాటి విమానం ఇంజన్.. బీచ్‌లో లాండ్‌.. వీడియో

Mon,May 7, 2018 04:30 PM

1930s plane lost its engine mid air, pilot lands it on a beach

ఆ విమానం ఇప్పటిది కాదు. యూకేకు చెందిన 1930 నాటి విమానం. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా దానితో ఎయిర్ షో చేద్దామనుకున్నారు. అందుకే దాని దుమ్ము దులిపి మరీ.. దానితో ఎయిర్ షో స్టార్ట్ చేశారు. అయితే.. ఎయిర్‌షో స్టార్ట్ కొంత సేపటికే.. ఆ విమానంలో ఏదో తేడా కొట్టింది. విమానం ఎత్తు తగ్గుతూ వస్తున్నది. దీంతో ప్రమాదాన్ని పసిగట్టిన పైలెట్.. ఇంజన్ ఫెయిల్ అయినట్లు అనుమానించాడు. దీంతో దాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడానికి ప్రయత్నించాడు. దాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయకపోతే అది క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ విమానంలో పైలెట్‌తో పాటు ఓ ప్యాసెంజర్ ఉన్నారు అంతే.

దీంతో.. పైలెట్ ఆ విమానాన్ని ల్యాండ్ చేయడానికి అక్కడికి సమీపంలో ఉన్న బీచ్ సరైన ప్రదేశమని భావించాడు. దీంతో బీచ్‌వైపుకు విమానాన్ని మళ్లించాడు. డెవన్‌లోని సిద్‌మౌత్‌లో ఉన్న జాకబ్ లాడర్ బీచ్‌లో విమానాన్ని ఎటువంటి ప్రమాదం లేకుండా ల్యాండ్ చేసి హీరో అయ్యాడు పైలెట్. అయితే.. ఆ బీచ్‌లో చాలామంది పర్యాటకలు ఉండగా.. వాళ్లకు పక్కకు తప్పుకోవాలంటూ సైగలు చేసి ఎవరికి ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా విమానాన్ని ల్యాండ్ చేశారు. ఈ ఘటనను బీచ్‌లో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.

4258
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles