డ్రగ్స్‌కు బానిసై.. డియోడరెంట్‌ను పీల్చబోయి..!

Fri,November 16, 2018 04:57 PM

19 year old youth in Netherlands inhale Deodorant died

ఆమ్‌స్టర్‌డామ్: 19 ఏళ్ల ఓ యువకుడు డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఆ వ్యసనం నుంచి బయటపడటానికి రీహాబిలిటేషన్ సెంటర్‌లో చేరాడు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న సమయంలో డియోడరెంట్‌ను పీల్చబోయి మృత్యువాత పడ్డాడు. రసాయనాలను పీల్చడం వల్ల శరీరానికి కలిగే నష్టాన్ని అతని పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో డాక్టర్లు వెల్లడించారు. డియోడరెంట్‌ను పీల్చగానే అతని గుండె పనిచేయడం మానేసింది. ఎంత చికిత్స చేయడానికి ప్రయత్నించినా.. అతని శరీరం సహకరించలేదు. డ్రగ్స్ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే తనకు ఏమీ దొరక్కపోవడంతో డియోడరెంట్‌ను పీల్చడానికి ప్రయత్నించాడు.

మొహానికి టవల్ అడ్డంగా పెట్టుకొని ఆ డియోడరెంట్ స్ప్రేను గట్టిగా పీల్చడానికి ప్రయత్నించాడు. దీనివల్ల మత్తు భావన కలిగి డ్రగ్స్‌కు అడిక్ట్ అయిన వాళ్లు ఎంతో హాయిగా ఫీలవుతారు. ఈ డియోడరెంట్‌ను పీల్చుకోగానే అతను ఎక్కడి లేని ఉత్సాహంతో గంతులేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత వెంటనే శరీరంలో రక్తప్రసరణ ఆగిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది. అతను జీవించడానికి అవసరమైన స్థాయిలో మెదడు పనిచేయడం లేదని మాస్తాద్ హాస్పిటల్ డాక్టర్ కెల్విన్ హార్వీ చెప్పారు. డియోడరెంట్‌ను పీల్చడం వల్ల మృత్యువాత పడటం చాలా అరుదని ఆయన తెలిపారు.

2842
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles