వామ్మో హెయిర్ డై ఇంత డేంజరా.. ఈ మహిళ తల ఎలా అయిందో చూడండి!

Mon,December 3, 2018 05:41 PM

19 year old suffered PPD poisoning after applying Hair Dye

పారిస్: పైన ఉన్న యువతి ఫొటో చూశారా? మూడు ఫొటోల్లో ఉన్నది ఒక్కరే. తొలి ఫొటో ఆమె హెయిర్ డై వేసుకున్నప్పటిది. ఆ తర్వాత ఫొటో ఆ మరుసటి రోజు ఉదయం తీసుకున్నది. ఆ మూడో ఫొటో కాసేపైన తర్వాత తీసింది. హెయిర్ డై వేసుకోవడం వల్ల ఆమె ఇలా వాచిపోయింది. రాత్రి హెయిర్ డై వేసుకుంటే.. ఉదయానికల్లా తన తల ఐదు సెంటీమీటర్ల మేర వాచిపోయినట్లు సదరు యువతి చెప్పింది. ఫ్రాన్స్‌లో ఈ ఘటన జరిగింది. 19 ఏళ్ల ఎస్టెల్ అనే యువతి పారాఫినైల్‌ఎనెడియమైన్ (పీపీడీ) అనే హెయిర్ డై వేసుకుంది. అయితే అది కాస్తా వికటించింది. దీంతో ఆమె తల సైజు మారిపోవడం మొదలైంది. హెయిర్ డై వేసుకోగానే తన తల వాచిపోవడం మొదలైందని, వెంటనే ఆసుపత్రికి పరుగులు పెట్టినట్లు ఆమె చెప్పింది.

ఇలాంటి రియాక్షన్ చాలా డేంజర్. ఇది కణజాలం నశించడానికి, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రావడానికి, మూత్రపిండాలు చెడిపోవడానికి కారణమవుతాయి. పీపీడీ వికటించడం అనేది పాశ్చాత్య దేశాల్లో చాలా అరుదుగా కనిపించే ఘటన. తూర్పు ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, భారత ఉపఖండంలో ఇలాంటివి తరచూ జరుగుతుంటాయి. ఒక్కో రసాయనానికి ఒక్కో శరీరం ఒక్కోలా స్పందిస్తుంది. అందువల్ల ఇలాంటి వాడే ముందు కాస్త జాగ్రత్త వహించాలని డాక్టర్లు చెబుతున్నారు. హైయిర్ డైలలో ఈ పీపీడీ సాధారణంగా కనిపించే రసాయనం. ఈ పీపీడీ కొందరికి వికటించిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. 2017లో గామా విలియమ్స్ అనే యువతికి కూడా హెయిర్ డై వేసుకోవడం వల్ల కళ్లు, చెవుల, నుదురు సమస్యలు వచ్చాయి.

5145
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS