ఫ్లోరిడా పాఠశాల కాల్పుల్లో 17 మంది మృతి

Thu,February 15, 2018 06:54 AM

17 Dead In Florida School Shooting After Expelled Student Opened Fire

అమెరికా: ఫ్లోరిడా పార్క్‌ల్యాండ్‌లోని పాఠశాలలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మర్జోరీ స్టోన్‌మన్ డగ్లస్ పాఠశాలలో పూర్వ విద్యార్థి తుపాకీతో ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 17 మంది మృతిచెందారు. 14 మందికి గాయాలయ్యాయి. స్కూల్ బిల్డింగ్ లోపల జరిపిన కాల్పుల్లో 12 మంది మృతిచెందారు. బిల్డింగ్ బయట ఇద్దరు. వీధిలో ఒకరు చనిపోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఎటువంటి ఘర్షణ, పెనుగులాటలు లేకుండానే నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. కాల్పులు జరిపిన పాఠశాల పూర్వ విద్యార్థి నికోలస్‌క్రూజ్(19)ను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రమశిక్షణా చర్యల కారణంగా నికోలస్ పాఠశాల నుండి బహిష్కరింపబడ్డాడు. అమెరికాలోని పాఠశాలల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు కాల్పుల ఘటన చోటుచేసుకోవడం ఇది 18వ సారి.

2172
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles