శ్రీలంక‌లో ఫైరింగ్‌.. 15 మంది మృతి

Sat,April 27, 2019 10:49 AM

15 killed in raids on ISIS hideout in Sri Lanka

హైద‌రాబాద్: శ్రీలంక‌లో ఇవాళ భ‌ద్ర‌తా ద‌ళాలు నిర్వ‌హించిన ఆప‌రేష‌న్‌లో 15 మంది మృతిచెందారు. ఆ మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఈస్ట‌ర్ వేడుక‌లను టార్గెట్ చేస్తూ ఉగ్ర‌వాదులు దాడులు నిర్వ‌హించిన త‌ర్వాత‌.. లంక పోలీసులు భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. అయితే శుక్ర‌వారం రాత్రి జ‌రిగిన ఆప‌రేష‌న్‌లో 15 మంది చ‌నిపోయిన‌ట్లు పోలీసులు చెప్పారు. ఆ ఆప‌రేష‌న్ స‌మ‌యంలో ముగ్గురు సుసైడ్ బాంబ‌ర్లు త‌మ‌ను తాము పేల్చుకున్నారు. మిగితా వారిని పోలీసులు షూట్ చేశారు. క‌ల్ముని ప‌ట్ట‌ణంలో ఓ ఇంట్లో ఇస్లామిక్ ఉగ్ర‌వాదులు ఉన్న‌ట్లు గుర్తించిన పోలీసులు అక్క‌డ‌కు వెళ్లారు. దాంతో భ‌ద్ర‌తా ద‌ళాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య ఫైరింగ్ జ‌రిగింది. గాలింపు చేసిన ప్రాంతం నుంచి ఐఎస్ జెండాతో పాటు యూనిఫామ్‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. గ‌త ఆదివారం జ‌రిగిన వ‌రుస పేలుళ్లో సుమారు 253 మంది మ‌ర‌ణించిన విషయం తెలిసిందే.

1512
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles