పెండ్లి కొడుకు సహా 14 మంది మృతి

Mon,July 30, 2018 02:44 PM

14 killed in Vietnam wedding party car crash

వియత్నాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ వియత్నాంలో పెండ్లి బృందంతో వెళ్తున్న వ్యాను ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పెళ్లి కొడుకు సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. 16 సీట్ల సామర్థ్యం ఉన్న వ్యానులో పెళ్లి కొడుకు కుటుంబం పెళ్లి కూతురు ఇంటికి బయలేదేరింది. దక్షిణ వియత్నాంలోని క్వాంగ్ నామ్‌కు సమీపంలో పెళ్లి బృదం ప్రయాణిస్తున్న వ్యాను కంటెయినర్ ట్రక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది స్పాట్‌లోనే చనిపోగా..మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలు విడిచినట్లు స్తానిక అధికారి ఒకరు తెలిపారు.

5492
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles