అగ్నిప్రమాదంలో 11 మంది నావికులు మృతి

Tue,January 22, 2019 12:09 PM

11 Dead As Two Ships With Indian Crew Catch Fire Off Russia

మాస్కో: సముద్రంలో సంభవించిన అగ్నిప్రమాదంలో 11 మంది నావికులు మృతిచెందారు. ఈ విషాద సంఘటన రష్యా ప్రదేశిక సముద్ర జలాల్లోని క్రెచ్ ైస్ట్రెట్ జలసంధిలో చోటుచేసుకుంది. ఒక షిప్‌లోని లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌ను మరొక షిప్‌లోని ట్యాంక‌ర్‌లోకి మార్పిడి చేస్తుండగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక షిప్‌లో 17 క్రూ మెంబర్స్ ఉండగా.. వీరిలో తొమ్మిది మంది టర్కిష్ జాతీయులు, ఎనిమిది మంది భారతీయులు ఉన్నారు. మరొక షిప్‌లో 15 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఏడుగురు టర్కిష్ జాతీయులు కాగా ఏడుగురు భారతీయులు. 11 మంది నావికులు సంఘటనా స్థలంలోనే చనిపోగా తొమ్మిది మంది ఆచూకీ తెలియకుండా పోయింది. మరో 12 మందిని ఇప్పటివరకు రక్షించారు.

714
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles