వ్యాన్ నుంచి కింద పడ్డ చిన్నారి.. గమనించని పేరెంట్స్.. ఆ తర్వాత.. వీడియో

Thu,April 26, 2018 03:12 PM

10 month old baby falls out of moving van video goes viral

తల్లిదండ్రులు కావడమంటే ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకొని ఉండాలి. అందరికీ ఆ భాగ్యం దక్కదు. పిల్లలకు జన్మనిచ్చాక మళ్లీ వాళ్లను అంతే బాధ్యతగా, ప్రేమగా పెంచాలి. అయితే చైనాలోని ఓ పేరెంట్స్ మాత్రం తమ 10 నెలల చిన్నారి వ్యాన్ నుంచి కింద పడ్డా పట్టించుకోకుండా అలాగే వెళ్లిపోయారు.

ఈ ఘటనను చూసిన స్థానికులే అవాక్కయ్యారు. కాని.. వాళ్లు మాత్రం కనీసం పిల్లాడిని పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిల్లాడిని వ్యాన్ వెనక ఉన్న సీట్‌లో పడుకోబెట్టి వాళ్లు ముందు కూర్చున్నారు. తండ్రి డ్రైవ్ చేస్తుండగా.. తల్లి అతడి పక్కన కూర్చున్నది. ఇక.. ఓ టర్నింగ్ వద్ద వ్యాన్ మిడిల్ డోర్ తెరుచుకోవడంతో బేబీ కింద పడిపోయాడు.

అదృష్టవశాత్తు చిన్నారికి ఎటువంటి గాయాలు కాలేదు. వెంటనే పిల్లాడిని గమనించిన మిగితా వాహనదారులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాని.. అత‌డికి ఏ ప్రమాదం జరగలేదని డాక్టర్లు చెప్పడంతో వెంటనే చిన్నారి తల్లిదండ్రులకు కబురు పంపారు.

3220
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS