కుప్పకూలిన బంగారు గని..10 మంది మృతి

Fri,November 8, 2019 10:48 AM


గినియా: ఈశాన్య గినియాలో అక్రమంగా తవ్వకాలు కొనసాగుతున్న బంగారు గని కుప్పకూలింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. సిగ్విరి ప్రావిన్స్‌లోని కింటింగ్‌నాన్‌లో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు స్థానిక స్వచ్చంద సంస్థ తెలిపింది. పశ్చిమాఫ్రికా దేశమైన గినియాలో బంగారం, వజ్రాలు, బాక్సైట్‌, ఇనుప ఖనిజం నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చాలా మంది పేదరికంలో మగ్గిపోతున్నారు. అక్రమ బంగారు గని ప్రమాదాలు ఇక్కడ తరచూ జరుగుతుంటాయి. గత ఫిబ్రవరిలో నొరస్సోబాలో బంగారు గని కుప్పకూలగా..17 మంది చనిపోయారు.

2702
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles