రూ.118కే బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్

Tue,May 15, 2018 06:34 PM

BSNL launched new prepaid plan for rs 118

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.118 కే ఓ నూతన ప్లాన్‌ను ఇవాళ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1 జీబీ డేటా లభిస్తాయి. ఈ ప్లాన్‌కు వాలిడిటీ 28 రోజులుగా నిర్ణయించారు. మరోవైపు జియోలో రూ.98 కే 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తుండగా అందుకు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇక ఈ ప్లాన్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు ఒక పర్సనల్ రింగ్ బ్యాక్ టోన్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నది.

1084
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles