అమెజాన్ ఫ్రీడం సేల్ షురూ.. ప్రొడ‌క్ట్స్‌పై 20వేల డీల్స్..!

Thu,August 9, 2018 02:55 PM

Amazon Freedom Sale started offering best deals on products

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రీడం సేల్ పేరిట ఇవాళ ఓ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ నెల 12వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, కన్‌జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, లార్జ్ అప్లయెన్సెస్, టీవీలు తదితర 170 మిలియన్ ప్రొడక్ట్స్‌పై 20వేలకు పైగా డీల్స్‌ను అందిస్తున్నది. వన్ ప్లస్, హువావే, శాంసంగ్, వివో, రియల్‌మి, జేబీఎల్, సోనీ తదితర కంపెనీలకు చెందిన ఉత్పత్తులపై ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలను అందిస్తున్నారు.

అమెజాన్ ఫ్రీడం సేల్‌లో అమెజాన్ ఎకో డివైస్‌లు, ఫైర్ స్టిక్, కిండిల్ ఈ-రీడర్స్‌పై తగ్గింపు ధర లభిస్తున్నది. మొబైల్ ఫోన్లు, వాటి యాక్ససరీలపై 40 శాతం, కన్‌జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌పై 50 శాతం వరకు డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. సేల్‌లో భాగంగా హువావే పీ20 ప్రొ రూ.5వేల తగ్గింపుతో రూ.59,999 ధరకు లభిస్తుండగా, నోకియా 6.1 4జీబీ వేరియెంట్ రూ.2వేల తగ్గింపుతో రూ.15,999 ధరకు, హువావే పి20 లైట్ రూ.16,999 ధరకు (రూ.3వేల తగ్గింపు) లభిస్తున్నాయి. ఇక వన్‌ప్లస్ 6 ఫోన్‌ను కొనేవారు తమ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.2వేల అదనపు డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. రియల్‌మి1 ఫోన్‌కు ఈ డిస్కౌంట్ రూ.1వేయి వరకు, శాంసంగ్ ఫోన్లకు రూ.10,700 వరకు, వివో ఫోన్లకు రూ.6వేల వరకు, మోటో ఫోన్లకు రూ.5,700 వరకు, ఒప్పో ఫోన్లకు రూ.8వేల వరకు అదనపు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. ఈ కంపెనీలకు చెందిన ఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై రూ.25వేల వరకు, టీవీలపై 40 శాతం వరకు, హెడ్‌ఫోన్లపై 60 శాతం వరకు, స్పీకర్లపై 50 శాతం వరకు, పవర్‌బ్యాంక్‌లపై 75 శాతం వరకు రాయితీలను అందిస్తున్నారు. ఎస్‌బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే మరో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇవే కాకుండా మరెన్నో ఆఫర్లను అమెజాన్ తన ఫ్రీడం సేల్‌లో అందిస్తున్నది.

1300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles