రూ.149తో మరింత డేటా.. ప్లాన్‌ను మార్పు చేసిన ఎయిర్‌టెల్..

Sun,June 10, 2018 04:12 PM

Airtel revises Rs 149 prepaid plan to offer 2GB data per day

టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు మరో ఆఫర్‌ను ప్రకటించింది. రూ.149 ప్లాన్‌కు మరింత డేటాను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ ప్లాన్‌లో రోజుకు 1జీబీ డేటా మాత్రమే వచ్చింది. కానీ ఇకపై ఇందులో రోజుకు 2 జీబీ డేటా లభ్యం కానుంది. అలాగే రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది.

దీంతో మొత్తం 28 రోజులకు గాను 56 జీబీ డేటాను వినియోగదారులు పొందవచ్చు. అయితే ఇదే ప్లాన్ జియోలోనూ అందుబాటులో ఉండగా అందులో రోజుకు 1.5 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఈ క్రమంలో రూ.149 ప్లాన్‌కు ఎయిర్‌టెల్ అందిస్తున్న డేటాయే ఎక్కువ కావడం విశేషం. అయితే ఈ ప్లాన్ మార్పు కేవలం ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిసింది. త్వరలో పూర్తి స్థాయిలో వినియోగదారులందరికీ ఈ ప్లాన్ ద్వారా 2 జీబీ డేటా అందివ్వనున్నారు.

2767
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles