గురువారం 03 డిసెంబర్ 2020
Hyderabad - Oct 25, 2020 , 12:15:12

ప్రేమ, పెండ్లి పేరుతో వంచన

ప్రేమ, పెండ్లి పేరుతో వంచన

నేరేడ్‌మెట్‌ : ప్రేమ, పెండ్లి పేరుతో మోసం చేయగా.. మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నేరేడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. ఇన్‌స్పెక్టర్‌ నర్సింహస్వామి వివరాల ప్రకారం..జేజేనగర్‌లో నివాసం ఉంటున్న అరుణ (21)  కరోనా కారణంగా ఉద్యోగం మానేసి ఇంటి వద్ద ఉంటుంది. అమ్ముగూడకు చెందిన జాన్సన్‌ (27) ఆర్మీ క్యాంటీన్‌లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేసి మానేశాడు. కొన్ని రోజుల క్రితం అరుణతో పరిచయం అయ్యింది. ప్రేమిస్తున్నానని, పెండ్లి  చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి తిరిగారు.. ఇటీవల పెండ్లి చేసుకోవాలని అరుణ కోరగా.. ముఖం చాటేశాడు.   అతడి గురించి ఆరా తీయగా.. అతడికి అప్పటికే వివాహమై భార్య ఉన్నట్లు తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన యువతి..  ఇంట్లో ఎవరులేని సమయంలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించగా.. అక్కడ సూసైడ్‌నోట్‌ లభించింది. అందులో నా ఆత్మహత్యకు జాన్సన్‌ కారణం అని రాసి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.