సోమవారం 26 అక్టోబర్ 2020
Hyderabad - Oct 01, 2020 , 07:02:13

యువకులకు శారీరక దారుఢ్యం ఎంతో అవసరం

యువకులకు శారీరక దారుఢ్యం ఎంతో అవసరం

మెహిదీపట్నం: యువకులకు శారీరక దారుఢ్యం ఎంతో అవసరమని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. బుధవారం మల్లేపల్లి డివిజన్‌ ఆగాపురాలో వ్యాయామశాల నిర్మాణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ ఎంఎస్‌.ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్‌ హుస్సేన్‌, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి సీహెచ్‌.ఆనంద్‌కుమార్‌గౌడ్‌లతో కలిసి ప్రారంభించారు. యువకులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, శారీరక  దారుఢ్యాన్ని పెంపొందించుకునేందుకు పాటుపడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్య, డిప్యూటీ కమిషనర్‌ ఇన్కెషాఫ్‌ అలీ, కార్పొరేటర్‌ ప్రతినిధి ఇక్బాల్‌ పాల్గొన్నారు.
logo