గురువారం 28 మే 2020
Hyderabad - May 19, 2020 , 01:46:42

గొడవను ఆపాడని.. చంపేశారు

గొడవను ఆపాడని.. చంపేశారు

మెహిదీపట్నం : గొడవను ఆపిన పాపానికి.. ఓ యువకుడు హత్యకు గురయ్యా డు. కత్తులతో దాడిచేసి  దారుణంగా చంపేశారు. ఈ సంఘటన ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం  చోటు చేసుకున్నది. ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌  కథనం ప్రకారం... ఆసిఫ్‌నగర్‌ హుడాకాలనీలో నివాసం ఉండే నర్సింహులు ఇంట్లో పెండ్లి విందు జరిగింది. ఈ సందర్భంగా అతని ఇంట్లో అద్దెకు ఉండే  సాయి అలియాస్‌ చింటు.. స్నేహితులు  శ్రవణ్‌(25), ఇతరులతో కలిసి మద్యం తాగాడు.  మద్యం మత్తులో సాయి టప్పాచబుత్ర రౌడీషీటర్‌ భిక్షపతి తమ్ముడు గణేశ్‌తో గొడవపడ్డాడు. 

ఈ గొడవను శ్రవణ్‌ ఆపి అందరినీ అక్కడినుంచి పంపించాడు.  అర్ధరాత్రి 12 గంటల తర్వాత గణేశ్‌.. అన్న భిక్షపతి, మరో ఇద్దరితో కలిసి కత్తులు, హాకీ స్టిక్‌లతో వచ్చారు. ఆ సమయంలో సాయి లేకపోవడంతో గొడవ ఆపడానికి ప్రయత్నించిన శ్రవణ్‌పై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు శ్రవణ్‌ను చికిత్స కోసం ఉస్మానియా దవాఖానకు తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.  పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు.


logo