గురువారం 28 మే 2020
Hyderabad - May 21, 2020 , 00:18:37

యువ పారిశ్రామికవేత్తలు సమయపాలన పాటించాలి

యువ పారిశ్రామికవేత్తలు సమయపాలన పాటించాలి

ఖైరతాబాద్‌: కొత్త స్టార్టప్స్‌తో ముందుకొచ్చే యువ పారిశ్రామికవేత్తలు సమయపాలన తప్పకుండా పాటించాలని ది ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా తెలంగాణ స్టేట్‌ సెంటర్‌ మాజీచైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ సూచించారు. జూమ్‌ క్లౌడ్‌ మీటింగ్‌ యాప్‌లో బుధవారం ‘టైమ్‌ మేనేజ్‌మెంట్‌'పై ఆన్‌లైన్‌ సదస్సు జరిగింది. ఈ సదస్సులో డాక్టర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ రాబోవు తరాలవారు టైమ్‌మేనేజ్‌మెంట్‌ను కచ్చితంగా పాటించాలని, ప్రతిఒక్కరికీ గోల్‌ సెట్టింగ్‌ ఉండాలన్నారు. దేశ భవిష్యత్తు యువ పారిశ్రామికవేత్తలపై ఆధారపడిందని, నూతన ఆవిష్కరణలు, కొత్త వస్తువుల రూపకల్పనలతో అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. పేపర్‌వర్క్‌, ఫోన్‌లో సంభాషణ, తోటి ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించే క్రమం లో సమయపాలన అనేది తప్పనిసరిగా ఉండాలన్నారు. తద్వారా నిర్దేశిత లక్ష్యాలను సాధించవచ్చన్నారు. సమావేశంలో హైదరాబాద్‌, బెంగళూరు, పుణె, నాసిక్‌కు చెందిన యువ పారిశ్రామికవేత్తలు, ప్రొఫెసర్లు, ఐఈఐ చైర్మన్‌ డాక్టర్‌ జి.రామేశ్వర్‌రావు, కార్యదర్శి టి.అంజయ్య పాల్గొన్నారు.


logo