e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home ఆరోగ్యం ప్రాణాయామం శ్వాస సులభతరం

ప్రాణాయామం శ్వాస సులభతరం

ప్రాణాయామం శ్వాస సులభతరం
 • కరోనా దుష్ప్రభావాలకు చెక్‌
 • ప్రాణాయామంతో ఊపిరితిత్తుల పనితీరు మెరుగు
 • యోగాతో ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం

అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే మార్గం యోగా, ప్రాణాయామం. ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిని కొంతైన నియంత్రించేందుకు, దుష్ప్రభావాలను అడ్డుకునేందుకు అవి ఆయుధాలు. ముఖ్యంగా కరోనా సోకితే ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుందనే భయం ఎక్కువగా ఉంది.. యోగాలోని కొన్ని ఆసనాలతో ఆ ఇబ్బందిని అధిగమించొచ్చని నిపుణులు చెబుతున్నారు. శ్వాస మీద ధ్యాస ఉంచే ప్రక్రియ ఆరోగ్యాన్ని కాపాడుతుందని వారు వివరిస్తున్నారు. కరోనా బాధితులు దవాఖానలు, హోం ఐసోలేషన్‌లో ప్రాణాయామం చేస్తూ ధైర్యంగా ఉంటున్నారు. కొన్ని రకాల ప్రాణాయామాలతో పాటు యోగా సాధన చేస్తే శ్వాస సమస్యలు పరిష్కారం కావడంతో పాటు రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా నుంచి బయటపడటం సులభతరం అవుతుందని చెబుతున్నారు. అంతేకాదు కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ‘గైడ్‌ లైన్స్‌ ఫర్‌ యోగా ప్రాక్టీషనర్స్‌ ఫర్‌ కొవిడ్‌-19’ పేరిట మార్గదర్శకాలను జారీ చేసింది.

భద్రాసనం – కీళ్లు, కండరాలు వృద్ధి చెందుతాయి

 • వీరాసనం – ఏకాగ్రత, శారీరక మానసిక ప్రశాంతతతో పాటు కాలేయం, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది.
 • మేరు వక్రాసనం – నడుంనొప్పి, మెడనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
 • అర్థమత్స్యేంద్రాసనం- కండరాల నొప్పుల్ని తగ్గిస్తుంది.
 • ఉష్ణ్రాసనం- వెన్నెముక నుంచి తల వరకు రక్త ప్రసరణ పెరుగుతుంది.
 • సుప్త వజ్రాసనం -హృదయ కండరాలకు మంచి వ్యాయామం.
 • ఓంకారం – మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ఓం కారాన్ని ఉచ్ఛరింప చేస్తున్నారు.

బస్త్రిక

 • తలను పైకి ఎత్తుతూ శ్వాసను గట్టిగా పీల్చుకొని కిందికి దించుతూ వదలాలి.
 • దీంతో శరీరంలోని క్రిములు, చెడు పదార్థాలు బయటకు వెళ్తాయి.
 • శ్వాస వృద్ధి చెందుతుంది. అస్తమా, సైనస్‌ సంబంధిత రుగ్మతలు ఉన్న వారికి ఇది ఎంతో ప్రయోజనకరం.

కపాలబాతి

 • పొత్తి కడుపులోని కండరాలపై ఒత్తిడి పడేలా గాలి పీల్చుతూ వదలాలి.
 • దీంతో ఊపిరితిత్తుల దృఢత్వం పెరుగుతుంది.
 • కరోనా వైరస్‌ ప్రధానంగా ఊపిరితిత్తుల పనితీరుపైనే ప్రభావాన్ని చూపిస్తుండడంతో ఈ ప్రాణాయామం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిఒక్కరికీ అత్యంత ఉపయోగకరం.

భ్రమరి

 • సుదీర్ఘంగా శ్వాసను పీల్చి ఆపాలి. మళ్లీ వదిలేసి మళ్లీ ఆపాలి.
 • ఇలా ఎన్నిసార్లు చేయగలిగితే అంత మంచిది.
 • దీంతో ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడంతో పాటు ఆక్సిజన్‌ స్థాయి వృద్ధి చెందే అవకాశం ఉంటుంది.

అనులోమ విలోమ

 • ఒక్క రంధ్రం నుంచి గట్టిగా శ్వాసను పీలుస్తూ మరో రంధ్రం నుంచి వదిలేయడాన్ని అనులోమ విలోమ పద్ధతి అంటారు.
 • ఇలా చేయడంతో శ్వాస నాళాల పనితీరు మెరుగుపడటంతో శ్వాసక్రియ వృద్ధి చెందుతుంది.
 • అంతేకాక ఏకాగ్రతతో చేసే ధ్యానంతో మానసిక ప్రశాంతత, సానుకూల దృక్పథం పెరుగుతుంది.

కరోనా వైరస్‌ మానవుని శ్వాసక్రియకు విఘాతం కల్గిస్తుండగా.. ప్రాణాయామం మాత్రం ఆ సమస్యను అధిగమించేలా చేస్తున్నది. శ్వాస సజావుగా అందేలా ప్రాణాయామం, శారీరక దృఢత్వానికి ఆసనాలు, మానసిక ప్రశాంతత కోసం సూర్య నమస్కారాలు అత్యుత్తమ మార్గాలని పలువురు నిపుణులు చెబుతున్నారు. మనసును శరీరాన్ని అనుసంధానం చేయడంలో ప్రాణాయామం కీలకం. రక్త ప్రసరణ సాఫీగా సాగేలా దోహదపడుతుంది. మనసులో చెలరేగే అలజడిని తగ్గిస్తుంది. సుఖ నిద్రకు ఉపయోగపడుతుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో చాలా మంది యోగా వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల ఈ మహమ్మారి నుంచి బయటపడిన వారు సైతం ఇది యోగా ద్వారానే సాధ్యమైందని చెబుతుండటం విశేషం. మరోవైపు యోగా సాధన, ప్రాణామాయం నేర్చుకునేందుకు వెబ్‌సైట్లు, యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.

పాణాయామం ఇలా చేద్దాం..!!

 • ముక్కు ద్వారా 4 సెకన్ల పాటు గాలిని పీల్చుకోవాలి. 7 సెకన్ల పాటు గాలిని ఆపాలి. అనంతరం 8 సెకన్ల పాటు ముక్కు ద్వారా గాలిని వదలాలి.
 • ఇలా 5 నుంచి 10 సార్లు చేయాలి. అప్పుడు మనసు తేలికపడుతుంది. ఇది శ్వాస మీద ధ్యాస ఉంచి పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చొని చేయాలి.
 • చేతులు చిన్‌ముద్రలో ఉండాలి. కండ్లు మూసుకుని నిదానంగా శ్వాసను పీల్చుతూ.. వదులుతూ ఉండాలి.
 • బొటన వేలితో కుడి నాసిక రంధ్రం మూస్తూ..ఎడమ నాసిక రంధ్రం నుంచి శ్వాసను తీసుకోవాలి.
 • మూడు అంకెలు లెక్కించే సమయంలో చేయాలి. మళ్లీ అదే సమయంలో వదలాలి. అలానే కుడి నాసిక రంధ్రం మూస్తూ ఎడమ నాసిక రంధ్రం ఉంచి శ్వాసను వదలాలి.
 • ముక్కుతో గాలి పీల్చి.. కొన్ని సెకన్ల పాటు ఆపి నోటితో వదలాలి.. ఎంత సమయం పీల్చుతామో.. అంత సమయం ఆపి నిదానంగా వదలాలి. ఇలా పదిసార్లు చేయాలి.

ఒత్తిడి దూరం

ప్రస్తుత పరిస్థితుల్లో యోగా చేయడం తప్పనిసరైంది. ఒత్తిడిని దూరం చేసేందుకు యోగాసనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సూర్యనమస్కారాలు, ప్రాణాయామం, యోగాసనాల ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం యోగసనాలు వేస్తున్నా. ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటున్నా.

పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు.. ప్రాణాయామం చేయండి

సమతుల ఆహారం తీసుకుంటూ ఉండాలి. దాంతో పాటు నిరంతరం యోగా చేస్తూ ఉంటే వైరస్‌లు మనల్ని తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉండకపోవచ్చు. ప్రస్తుతం రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నవారిపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఇలాంటి సమయాల్లో మనసు శాంతపరుచుకోవడానికి ప్రాణాయామం సహాయపడుతుంది. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు పది నిమిషాల పాటు ప్రాణాయామం చేయాలి. పాజిటివ్‌ వారిని హోం ఐసొలేషన్‌లోనే ఉంచుతూ ఫోన్‌లో సూచనలు, సలహాలు ఇస్తూ ప్రాణాయామం చేయిస్తున్నాం. – డి. చంద్రిక, యోగా నిపుణులు

శ్వాసపైనే దృష్టి సారిస్తున్నాం

ప్రాణాయామం, యోగాసనాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కేవలం శ్వాసకు సంబంధించిన ప్రాణాయామం, ఆసనాలు ఎక్కువగా చేయిస్తున్నాం. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రత్యేక శిక్షణకుడి ద్వారా ఎక్కువగా సూక్ష్మ వ్యాయామం నిర్వహిస్తున్నాం. కరోనా నుంచి కోలుకున్నాక శారీరక దృఢత్వాన్ని పెంచే ఆసనాలు వేయాలి. – శొంఠి భవానీ, సూపరిటెండెంట్‌, నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రాణాయామం శ్వాస సులభతరం

ట్రెండింగ్‌

Advertisement