బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Jul 01, 2020 , 00:42:26

అధ్వానరహదారులు.. అద్దంలా

అధ్వానరహదారులు.. అద్దంలా

మారనున్న గూడ్‌షెడ్‌ రోడ్డు రూపు రేఖలు

సీఆర్‌ఎంపీ కార్యక్రమంలో భాగంగా రోడ్డు, ఫుట్‌పాత్‌ పనులు

రూ.28 లక్షల వ్యయంతో కొనసాగుతున్న వీడీసీసీ రోడ్డు పనులు  

కూకట్‌పల్లి: నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే మూసాపేట్‌ గూడ్‌షెడ్‌ రూపు రేఖలు మారుతున్నాయి. కొత్తగా రోడ్డు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మూసాపేట్‌ కూడలి నుంచి సుమారు కిలో మీటర్‌ మేర అధ్వానంగా ఉన్న రహదారిని పునరుద్ధరించడానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చొరవ తీసుకుని నిధులను మంజూరు చేశారు. బీటీతో పాటు రూ.28 లక్షల వ్యయంతో 400 మీటర్ల పొడవు వీడీసీసీ రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే భారీ వాహనాలతో పాటు అనేక కంపెనీలు, కాలనీలకు రోజు కొన్ని వేల మంది ఈ రోడ్డు గుండా రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఏండ్ల నుంచి అధ్వానంగా ఉన్న గూడ్‌ షెడ్‌ రోడ్డు ఎమ్మెల్యే చొరవతో మంచి రోజులొచ్చాయి. దీనికి తోడు సీఆర్‌ఎంపీలో భాగంగా మూసాపేట్‌ కూడలి నుంచి 900 మీటర్ల వరకు బీటీ రోడ్డుకు 2.5 మీటర్ల వెడల్పుతో ఇరువైపులా ఫుట్‌పాత్‌ పనులు చేపడుతున్నారు. దశాబ్ద కాలంగా అధ్వానంగా ఉన్న గూడ్‌షెడ్‌ రోడ్డు పనులు చేపడుతుండటంతో రోడ్డు రూపు ఖలు మారనున్నాయని కాలనీ వాసులు ఆనందాన్ని వ్యక్త పరుస్తున్నారు. 

రోడ్డు పనులను త్వరగా పూర్తి చేస్తాం 

సీఆర్‌ఎంపీ కార్యక్రమంలో భాగంగా మూసాపేట్‌ గూడ్‌షెడ్‌ రోడ్డు పనులను చేపడుతున్నాం. జోనల్‌ కమిషనర్‌ మమత ఆధ్వర్యంలో పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం.

- నాగేందర్‌ యాదవ్‌, ఈఈ, మూసాపేట్‌ సర్కిల్‌