ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Hyderabad - Feb 24, 2021 , 04:37:20

వరలక్ష్మికి అరుదైన గౌరవం

వరలక్ష్మికి అరుదైన గౌరవం

బన్సీలాల్‌పేట్‌/కవాడిగూడ, ఫిబ్రవరి 23: తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ రాష్ట్ర కార్యదర్శి మంచాల వరలక్ష్మికి ‘వరల్డ్‌ హ్యుమన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ కమిషన్‌' గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. న్యూఢిల్లీలో కొవిడ్‌-19 నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం అనే అంశంపై మంగళవారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో 12 దేశాల నుంచి వచ్చిన కమిషనర్ల సమక్షంలో విద్యారంగం, సామాజిక సేవ, మహిళా సాధికారత రంగాలలో విశిష్ట సేవలందిస్తున్న ఎం.వరలక్ష్మిని సన్మానించి, ఆమెకు డాక్టరేట్‌ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ వివిధ దేశాల నుంచి వచ్చిన మానవ హక్కుల పరిరక్షణ కమిషనర్ల చేతుల మీదుగా తాను గౌరవ డాక్టరేట్‌ అందుకోవడం పట్ల ఎంతో ఆనందంగా ఉన్నదన్నారు. దీంతో తనకు సమాజం పట్ల మరింత బాధ్యత పెరిగిందన్నారు. తనకు గౌరవ డాక్టరేట్‌ రావడానికి ప్రోత్సహించిన తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ధన్యవాదాలు వరలక్ష్మి తెలిపారు.

VIDEOS

logo