e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home హైదరాబాద్‌ ఇష్టమైనా కొంచెం కష్టం

ఇష్టమైనా కొంచెం కష్టం

ఇష్టమైనా కొంచెం కష్టం
  • ఇంటి నుంచి పనిచేస్తున్నా.. తప్పని అధిక పని, శ్రమ
  • పెరిగిన భారంతో ఐటీ ఉద్యోగులకు మానసిక శ్రమ
  • మానసిక ప్రశాంతతోనే సంయమనం

ఇంటి నుంచి పనిచేస్తున్నామన్న మాటే గానీ.. ఆఫీసులో కన్నా రెట్టింపు ఒత్తిడికి గురవుతున్నారు ఐటీ ఉద్యోగులు. ఇంట్లోనే ఉండి పనిచేస్తున్నా వేళకు భోజనం చేయడం లేదు. సమయానికి నిద్ర పోవడం లేదు. దీంతో తమకు మానసిక శ్రమ, ఒత్తిడి పెరిగిపోతున్నాయని సహచరులతో ఆవేదన చెందుతున్నారు. పూర్తిగా కార్యాలయాలు తెరుచుకునే వరకు దైనందిన జీవితం, పెరిగిన పని శ్రమను ఎలా సమన్వయపరుచుకోవాలో మానసిక నిపుణులు కొన్ని సలహాలు సూచిస్తున్నారు.

ఆఫీసులో అయితే…

  • రోజూ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు కచ్చితమైన వేళలు పాటిస్తారు.
  • కార్యాలయాలకు వెళ్లిన తరువాత అక్కడ పనిచేసే వాతావారణం ఉంటుంది.
  • టాస్క్‌లో భాగంగా ఏవైనా సందేహాలు, ఇబ్బందులు ఎదురైతే సహచరులు, సీనియర్లతో వాటిని పరిష్కరించుకోవచ్చు.
  • అంతేకాకుండా..కార్యాలయంలో ఒకసారి లాగిన్‌ అయిన తర్వాత మళ్లీ లాగాఫ్‌ అయ్యే వరకు నిర్దిష్ట సమయంలో పని చేయాల్సి ఉంటుంది.
  • అది పూర్తయితే ఇంటికి వచ్చేయొచ్చు. కానీ ఇప్పుడలా కాదు.
  • వర్క్‌ ఫ్రం హోం పేరుతో పనివేళలతో సంబంధం లేకుండా టాస్క్‌లు ఇవ్వడంతో ఇంట్లోనే..కుటుంబ సభ్యులతో సమయం వెచ్చించలేని పరిస్థితి ఏర్పడింది.

ఇంట్లో ఉన్నప్పుడు..

  • జీవితం స్థిరంగా సాగాలంటే మన చేతి నిండా పని ఉండాలి.
  • అప్పుడే మన ఉద్యోగం సరైన దిశలో పురోగమిస్తుంది.
  • ఒత్తిడి లేని పనంటూ ఏదీ ఉండదు.
  • కానీ కొన్నిసార్లు నిర్దిష్ట సమయాలు కాకుండా అదనపు వేళల్లో అదనపు శక్తితో పనిచేయాల్సి వస్తుంది.
  • పైగా కరోనా లాంటి విషమ పరిస్థితులెదురైనప్పుడు ఇంట్లో పని సమయాలయను ఆఫీసు టాస్కులకు అనుగుణంగా సమన్వయం చేసుకోక తప్పదు.
  • కచ్చితమైన టైం టేబుల్‌ను ఏర్పాటు చేసుకొని పనిపై తప్పనిసరిగా ధ్యాస పెట్టాలి.
  • ఇంట్లో పనిచేస్తున్నా కార్యాలయంలో పనిచేస్తున్నట్టుగానే భావించాలి.
  • అయితే ఇంటి అవసరాల కోసం మధ్య మధ్యలో నిర్దిష్టమైన బ్రేక్‌లు.. ఉదయమే ప్లాన్‌ చేసుకోవాలి.
  • ఇంట్లోనే ఉన్నాం కదా..అని పని సమయాలను స్నేహితులతో, బంధువులతో మాట్లాడేందుకు కేటాయిస్తే.. నిర్దిష్ట సమయంలో పని పూర్తి కాక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది.
  • టాస్క్‌ పూర్తయ్యాకే.. రిలాక్సయ్యేందుకు ప్రయత్నించాలి.

సంయమనంతోనే సమన్వయం..

వర్క్‌ఫ్రమ్‌ హోం చేస్తున్న వారికి ఒత్తిడి పెరిగినా మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అప్పుడే అన్ని పనులు సక్రమంగా చేయగలరు. ఇచ్చిన పని సక్రమంగా పూర్తి చేయాలంటే సంయమనమే పెద్ద టూల్‌. మానసిక ప్రశాంతత కోసం మధ్య మధ్యలో..ఐదు నిమిషాలు, పది నిమిషాలు బ్రేక్‌ తీసుకోవాలి. ఆ సమయాల్లో స్నాక్స్‌, టీ, జ్యూస్‌ తీసుకోవడంతో మరింత శక్తిని పొందగలుగుతారు. ప్రతి రోజూ యోగా, ధ్యానం చేయడంతో ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. – కవిత, మానసిక వైద్యనిపుణురాలు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇష్టమైనా కొంచెం కష్టం

ట్రెండింగ్‌

Advertisement