e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home హైదరాబాద్‌ విజ్ఞాన సోదరులు

విజ్ఞాన సోదరులు

విజ్ఞాన సోదరులు

జీడిమెట్ల, మార్చి 26: చిన్నవయసులోనే అనంతమైన జ్ఞానంతో అపారమైన ప్రతిభ కనబరుస్తున్నారు ఆ సోదరులు.. ప్రపంచంలో అరుదైన విషయాలను అవలీలగా చెబుతూ… ఏ ప్రశ్న అడిగినా..ఓస్‌ అంతేనా..అన్నట్లు ఠక్కున సమాధానాలిస్తూ… బాల మేధావులుగా రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ వండర్‌ బ్రదర్స్‌ సాధించిన అద్భుతాలు.. వారికి గుర్తింపు రావడానికి కారణాలేమిటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం..
ప్రతిభ ఘనం..
షాపూర్‌నగర్‌కు చెందిన యల్లమిల్లి సూరజ్‌ సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌. భార్య ప్రవీణ గృహిణి. వీరికి ఏడేండ్ల జోనాథన్‌, మూడేండ్ల జోయల్‌ సంతానం. చింతల్‌లోని సెయింట్‌ మార్టిన్‌ హైస్కూల్‌లో జోనాథన్‌ గ్రేడ్‌-4 చదువుతున్నాడు. తమ్ముడు జోయల్‌ ఇంటి వద్దే ఉంటూ.. అన్న నేర్చుకునే ప్రతి విజ్ఞాన అంశాన్ని నేర్చుకోవడం అలవాటు చేసుకున్నాడు. తల్లి ప్రవీణ సైతం కుమారులకు విషయ పరిజ్ఞానాన్ని బోధించేవారు. 2017లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జోనాథన్‌కు ఉపన్యాసం చెప్పే అవకాశం వచ్చింది. నాడు జోనాథన్‌ అనర్గళంగా చేసిన ప్రసంగంతో
అతిథులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. 50 సాధారణ పరిజ్ఞానంపై ప్రశ్నలతో హోంవర్క్‌ ఇవ్వగా, రెండు రోజుల్లో పూర్తి చేయడంతో ఉపాధ్యాయులు అతని మేధాశక్తిని గుర్తించి.. మరింత ఉత్సాహపరిచారు. బాలల దినోత్సవం సందర్భంగా జోనాథన్‌ 150 ప్రశ్నలకు నిమిషాల వ్యవధిలోనే సమాధానాలు చెప్పడంతో అతడిని ‘వండర్‌ కిడ్‌ ఆఫ్‌ స్కూల్‌’గా సన్మానించారు. అప్పటి నుంచి ఎక్కడ పోటీలు జరిగినా.. పాల్గొనే జోనాథన్‌..నిమిషాల వ్యవధిలో ఆధ్యాత్మిక, శాస్త్ర, సాంకేతిక, గణిత, సినిమా, రాజకీయ, సామాజిక తదితర అంశాలపై సంధించే ప్రశ్నలకు అవలీలగా సమాధానాలు చెప్పేవాడు. ఇలా తన మేధాశక్తిని ప్రదర్శించి.. పలు అవార్డులు కైవసం చేసుకున్నాడు.
అన్న బాటలోనే తమ్ముడు..
జోయల్‌ సైతం అన్నబాటలో నడుస్తూ..తన మేధాసంపత్తిని ప్రదర్శిస్తున్నాడు. 120 చిత్రాలు, పక్షుల పేర్లు, ట్రాఫిక్‌ సింబల్స్‌, రూల్స్‌, జాతీయ చిహ్నాలు, ఎ టు జడ్‌ అల్ఫాబెటికల్‌ ఆంగ్ల పదాల బొమ్మలు గుర్తు పట్టడంతో పాటు వివిధ అంశాలపై సులువుగా సమాధానాలు ఇస్తాడు. జోయల్‌కు సైతం తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్డ్‌ సూపర్‌కిడ్స్‌ అవార్డులు వరించాయి.
జోనాథన్‌ మేధాశక్తి..
2019లో అబాకస్‌ నేషనల్‌ కాంటెస్ట్‌లో చాంపియన్‌ ట్రోపి సాధించాడు.
2019 సెప్టెంబర్‌లో బైబిల్‌ పేర్లను తెలుగు, ఇంగ్లిష్‌లో 1.18 నిమిషాల్లో చెప్పి.. వరల్డ్‌ రికార్డు ఆఫ్‌ ఇండియా అవార్డునుసొంతం చేసుకున్నాడు.
వీటితో పాటు వండర్‌ కిడ్‌ ఆఫ్‌ స్కూల్‌, సూపర్‌కిడ్స్‌ రికార్డు ఆధ్వర్యంలో సూపర్‌కిడ్‌ అవార్డును అందుకున్నాడు.
దేశ,రాష్ట్ర, ప్రపంచ దేశాల పేర్లు, రాజధానులు, రాజకీయ పార్టీల గుర్తులు, జెండా రంగులు, ప్రత్యేకతలు, ముఖ్యమైన తేదీలు, చారిత్రాత్మక ప్రదేశాలు, స్వాతంత్ర సమరయోధుల పేర్లు,నినాదాలు, పుస్తకాలు, వాటి రచయితల పేర్లు, ఖండాలు, జంతువుల పేర్లు, వాటి ఉనికి, రాష్ట్ర, జాతీయ నృత్యాలు, ప్రపంచ, దేశ చిత్రపటాల్లో ప్రాంతాల గుర్తింపు తదితర అంశాలకు చెందిన వెయ్యి ప్రశ్నలకు నిమిషాల్లో సమాధానాలు చెప్పగలడు. 2018 ఆగస్టు 13న జోనాథన్‌ 500 ప్రశ్నలకు 11 నిమిషాల 11 సెకండ్ల వ్యవధిలో సమాధానాలు చెప్పి..తెలంగాణ బుక్‌ ఆఫ్‌
రికార్డ్స్‌తో పాటు ఇండియా టాలెంట్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో
నిర్వహించిన పోటీల్లో జాతీయ స్థాయి అవార్డును సాధించాడు. 18 అంశాలకు చెందిన 350 ప్రశ్నలకు 6.45 నిమిషాల
వ్యవధిలో సమాధానాలు చెప్పి..తెలుగు బుక్‌ ఆఫ్‌
రికార్డును కైవసం చేసుకున్నాడు. 2019 మార్చిలో 700 ప్రశ్నలకు 16 నిమిషాల్లో సమాధానాలు
చెప్పి రెండు అంతర్జాతీయ అవార్డులతో పాటు వండర్‌ బుక్‌ ఆఫ్‌
రికార్డ్స్‌, క్రియేటివ్‌ రికార్డ్‌ నేపాల్‌ అవార్డులను సాధించాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విజ్ఞాన సోదరులు

ట్రెండింగ్‌

Advertisement