బుధవారం 28 అక్టోబర్ 2020
Hyderabad - Sep 18, 2020 , 02:27:47

మంత్రి కేటీఆర్‌ కృషితో.. విశ్వనగరంగా హైదరాబాద్‌

మంత్రి కేటీఆర్‌ కృషితో..  విశ్వనగరంగా హైదరాబాద్‌

ఎస్‌ఎం ముజీబ్‌హుస్సేనీ

సుల్తాన్‌బజార్‌ : మంత్రి కేటీఆర్‌ కృషితో హైదరాబాద్‌ నగరం విశ్వనగరంగా మారుతున్నదని టీఎన్జీవో హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఎం ముజీబ్‌ హుస్సేనీ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన జిల్లా శాఖ కార్యాలయంలో మాట్లాడారు. 2016 నుంచి 2020 వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఇందులో భాగంగా ఐటీ హబ్‌, టీఎస్‌ ఐపాస్‌, రహదారుల నిర్మాణం,ై ఫ్లెఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించి అభివృద్ధి పరిచామని మంత్రి బుధవారం అసెంబ్లీలో ప్రస్తావించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల నేతృత్వంలో గత ఐదేండ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మంత్రి కేటీఆర్‌ కృషితో ఎన్నో కంపెనీలను హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నారని, దీంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పేల చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కె.దేవేందర్‌, కోశాధికారి జె. బాలరాజ్‌, ప్రచార కార్యదర్శి కురాడి శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు విక్రమ్‌కుమార్‌, మురళీరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo