శుక్రవారం 30 అక్టోబర్ 2020
Hyderabad - Aug 03, 2020 , 23:09:35

అన్నదమ్ములకు ప్రేమతో...

అన్నదమ్ములకు ప్రేమతో...

రాఖీలు కట్టిన సోదరీమణులు-ఇంటింటా సందడి వాతావరణం

కంటోన్మెంట్‌/ సికింద్రాబాద్‌/ సనత్‌నగర్‌: అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్‌ పండుగను    దీంతో ఇంటింటా సందడి వాతావరణం నెలకొన్నది. అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టి ఆత్మీయతను పంచుకున్నారు సోదరీమణులు. దూరప్రాంతాల నుంచి వచ్చిన తోబుట్టువులతో ఆయా పరిసర ప్రాంతాలు కళకళలాడాయి. సుదూర ప్రాంతాల్లో ఉన్న మరికొందరు కొరియర్‌, పోస్ట్‌ద్వారా తమ సోదరులకు రాఖీలు పంపించి ఆప్యాతయను చాటారు.

 సికింద్రాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి టి. పద్మారావుకు తన అక్క శకుంతల రాఖీ కట్టారు. అంతేకాక టీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు మహిళలు పెద్ద ఎత్తున వచ్చి రాఖీలు కట్టారు. స్వీట్లు తినిపించారు. 

 సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రక్షా బంధన్‌ సందర్భంగా సోమవారం వెస్ట్‌ మారేడుపల్లిలోని తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఆయన సోదరీమణులు రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి రక్షా బంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు.  తలసాని సాయికిరణ్‌యాదవ్‌కు తన సోదరీమణులు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు.

 బన్సీలాల్‌పేట్‌ : చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ సీఐ బాలగంగిరెడ్డికి, గోపాలపురం లా అండ్‌ ఆర్డర్‌ పీఎస్‌, ట్రాఫిక్‌ పీఎస్‌ పలు చౌరస్తాలలో పనిచేస్తున్న ట్రాఫిక్‌ పోలీసులకు స్కై ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థ ఉపాధ్యక్షురాలు ఓ.పావనీ రాఖీలు కట్టారు. 

న్యూబోయిగూడలో టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి ఈ. మనీశ్‌ కుమార్‌కు ఆయన సోదరి గ్రీష్మ రాఖీ కట్టి మాస్కులను, శానిటైజర్లను అందజేశారు.