శనివారం 31 అక్టోబర్ 2020
Hyderabad - Sep 19, 2020 , 00:21:32

రక్తదానంతో .. ప్రాణాలను కాపాడండి

రక్తదానంతో .. ప్రాణాలను కాపాడండి

హఫీజ్‌పేట్‌, సెప్టెంబర్‌ 18: ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి.. ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం హఫీజ్‌పేట్‌ డివిజన్‌ పరిధిలోని హుడా కాలనీ కమ్యూనిటీ హాల్‌లో టీపీయూఎస్‌ (తెలంగాణ ప్రైవేట్‌ ఉద్యోగ సంఘం) శేరిలింగంపల్లి అధ్యక్షుడు కంది జ్ఞానేశ్వర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, కార్పొరేటర్లు పూజితగౌడ్‌, హమీద్‌పటేల్‌, టీపీయూఎస్‌ అధ్యక్షుడు గంధం రాములుతో కలిసి ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రక్త నిల్వలను పెంచేందుకు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం ఎంతో ముఖ్యమన్నారు. కరోనా వ్యాధి రోజు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో బ్లడ్‌ బ్యాంక్‌లో రక్త నిల్వలను పెంచుకోవాలని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, సీపీ సజ్జనార్‌ల పిలుపు మేరకు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం టీపీయూఎస్‌ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్‌ యాదవ్‌, హఫీజ్‌పేట్‌ డివిజన్‌ అధ్యక్షుడు గౌతమ్‌గౌడ్‌, మియాపూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు మిరాయాల రాఘవరావు, వాలా హరీశ్‌, లక్ష్మారెడ్డి, దాసరి గోపి, రాజు, గోపాల్‌రాజు, శ్రీనివాస్‌, చాంద్‌ పాషా, పీవై రమేశ్‌, భానుప్రకాశ్‌, రోజా, శ్రావణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.