మంగళవారం 11 ఆగస్టు 2020
Hyderabad - Jul 14, 2020 , 23:32:06

వెయ్యి ఫైన్‌ కడుతారా..? మాస్కు ధరిస్తారా.?

వెయ్యి ఫైన్‌ కడుతారా..? మాస్కు ధరిస్తారా.?

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నో మాస్కు... నో ఎక్స్‌క్యూజ్‌ అంటున్నారు. రాచకొండ పోలీసులు. ప్రతి ఒక్కరూ మాస్కును ధరించాలని రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ కోరుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్కు ధరించని వారిపై కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు. స్పెషల్‌ డ్రైవ్‌ను చేపట్టిన రాచకొండ పోలీసులు.. మాస్కు ధరించని వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మే 11నుంచి జూలై 14 వరకు దాదాపు 4800 మందికి రూ.1000 జరిమానా విధించడంతో పాటు వారిపై డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు. కోర్టులు ప్రారంభమైన తర్వాత వీరిని ఈ పెట్టీ కేసుల కింద చార్జిషీట్‌లను దాఖలు చేసి.. అభియోగానికి సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామని వివరించారు. పక్కా ఆధారాలు ఉండటంతో జైలు శిక్ష పడే అవకాశం ఉన్నదని తెలిపారు.


logo