గురువారం 22 అక్టోబర్ 2020
Hyderabad - Oct 01, 2020 , 06:45:46

నియోజకవర్గంలోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తా

నియోజకవర్గంలోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తా

మహిళా భవనం అదనపు అంతస్తు నిర్మాణం, సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి

చర్లపల్లి : నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ఏఎస్‌రావునగర్‌లో సుమారు రూ. 15లక్షలతో మహిళా భవనం అదనపు అంతస్తు నిర్మాణం, సుమారు రూ. 12లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ పావనీమణిపాల్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధానంగా నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. మహిళలు సాధికారత సాధించేందుకు మహిళా భవన నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. జమ్మిగడ్డలో నెలకొన్న సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి తెలిపారు.  కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ కొత్త రామారావు, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బేతాల బాల్‌రాజు, సురేందర్‌రావు, నాయకులు శేర్‌ మణెమ్మ, కాసం మహిపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కుమారస్వామి సీతారామిరెడ్డి, బాషా, చిన్న తదితరులు పాల్గొన్నారు. 


logo