సోమవారం 01 జూన్ 2020
Hyderabad - May 19, 2020 , 01:09:12

భర్తను చంపింది..గుండెపోటని నమ్మించింది...

భర్తను చంపింది..గుండెపోటని నమ్మించింది...

హైదరాబాద్  : వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. ఏమీ తెలియనట్లు గుండెపోటుతో మరణించాడని  నమ్మించి.. అంత్యక్రియలు పూర్తి చేయించింది. అనుమానం వచ్చిన బంధువులు మృతుడి పెద్ద కొడుకును విషయం అడగడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. నాగభూషణం (36) తన భార్య జయమేరీ, పిల్లలతో కలిసి లాలాపేటలోని వినోభానగర్‌లో నివసిస్తున్నాడు. వృత్తిరీత్యా ఆటోడ్రైవర్‌ అయిన  నాగభూషణం గుండెపోటుతో మృతిచెందాడని, భార్య  ఉదయం బంధువులకు సమాచారం ఇచ్చింది. 

ఇది నమ్మిన బంధుమిత్రులు నాగభూషణం అంత్యక్రియలు చేశారు. అయినా అనుమానం వచ్చిన కొందరు బంధువులు మృతుడి పెద్ద కొడుకుని పదేపదే ప్రశ్నించగా, తన తండ్రి ముఖంపై రాజు అలియాస్‌ రాజేశ్‌ అనే వ్యక్తి దిండు అదిమిపెట్టి చంపేశాడని, దీనికి తన తల్లి సహకరించిందని వివరించాడు. దీంతో మృతుడి మేనల్లుడు హరికృష్ణ ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజు జయమేరీతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇది తెలిసిన నాగభూషణం భార్యతో గొడవపడేవాడు. దీంతో భర్తను  అడ్డు తొలగించుకోవాలని భావించిన జయమేరీ.. ఘాతుకానికి ఒడిగట్టింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


logo