సిటీబ్యూరో, జూలై 29(నమస్తే తెలంగాణ): వాట్సాప్ వీడియో కాల్స్‌తో మహిళలను వేధిస్తున్న ఓ వ్యక్తిని గురువారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. చిలకలూరుపేటకు చెందిన అన్నప్పరెడ్డి ఏడుకొండలు మేస్త్రీ. అశ్లీల వెబ్సైట్లలో వీడియోలు చూస్తూ.. పలు నంబర్లకు వాట్సాప్ కాల్స్ చేస్తుంటాడు. కాల్ చేసిన సమయంలో అతడి ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. పురుషులు మాట్లాడితే వెంటనే కట్ చేస్తూ.. ఆడవాళ్లు అయితే అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తుంటాడు. ఈవిధంగా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓ మహిళను వేధించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం ఏడుకొండలును అరెస్టు చేశారు.