ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 05, 2020 , 00:34:02

వాట్సాప్‌ పాఠాలు.. సివిల్స్‌ విజేతలు

వాట్సాప్‌ పాఠాలు.. సివిల్స్‌ విజేతలు

అభ్యర్థులకు విజయ బాటను అందించిన సీపీ మహేశ్‌భగవత్‌

సివిల్స్‌ ఫలితాల్లో 110 మంది ఉత్తీర్ణత

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ వాట్సాప్‌ పాఠాలు మరోసారి మంచి ఫలితాలను ఇచ్చాయి. ఇంటర్వ్యూలో గందరగోళం లేకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కొని నిలబడేలా చేశారని ఉత్తీర్ణులైన అభ్యర్థులు సీపీ మహేశ్‌భగవత్‌కు మెసేజ్‌ ద్వారా ధన్యవాదాలు పంపారు. మహేశ్‌భగవత్‌ వాట్సాప్‌ గ్రూపులో మహారాష్ట్రకు చెందిన 70 మంది అభ్యర్థులు సివిల్స్‌ విజేతలుగా నిలువగా, తెలుగు రాష్ర్టాల నుంచి 40మంది ఉత్తీర్ణత సాధించారు. టాప్‌ 100ర్యాంకుల్లో 13 ర్యాంకులను సాధించడం సీపీని ఆనందంలో ముంచేసింది. ఫైనల్‌ ఇంటర్వ్యూతో పాటు పర్సనాల్టీ టెస్టుకు సంబంధించి గతంలో విజయం సాధించిన వారితో తాజా అభ్యర్థులకు పాఠాలు అందించారు. జనవరి నుంచి జులై వరకు ప్రతి రోజు 2 నుంచి 3గంటల పాటు అభ్యర్థుల కోసం సమ యం కేటాయించి వారికి అన్ని అంశాల్లో పరిజ్ఞానం పంచారు. ఈ విధంగా రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ అభ్యర్థులకు గత మూడేండ్లుగా అండగా నిలబడుతున్నారు. ఈ ఏడాది ఓవైపు కరోనా విధుల్లో ఉంటూనే మరో వైపు అభ్యర్థులకు పాఠాలు నేర్పారు. తన కృషి ఇలాగే కొనసాగుతుందని సీపీ స్పష్టం చేశారు.

సత్తా చాటిన విద్యార్థులు...

హిమాయత్‌నగర్‌/ చిక్కడపల్లి : యూపీఎస్సీ  మంగళవారం విడుదల చేసిన 2019 సివిల్‌ సర్వీస్‌ పరీక్షా ఫలితాల్లో పలువురు విద్యార్థులు సత్తా చాటారు. 

ఆర్‌సీ రెడ్డికి 14 ర్యాంకులు..

అశోక్‌నగర్‌లోని ఆర్‌సీ రెడ్డి కోచింగ్‌ సెంటర్‌కు 14 ర్యాంకులు లభించాయని ఆ సంస్థ అధినేత ఆర్‌సీ రెడ్డి తెలిపారు. మల్లవరు సూర్యతేజ(76వ ర్యాంకు), ఎన్‌.విశాల్‌ తేజ(91వ ర్యాంకు), ప్రేమ్‌ సాగర్‌(170వ ర్యాంకు), తేజదీపక్‌(279వ ర్యాంకు), మోహన కృష్ణ(295వ ర్యాంకు), సీతాకుమార్‌(417వ ర్యాంకు), కార్తీక్‌(478వ ర్యాంకు), రజనీకాంత్‌(598వ ర్యాంకు), అలేఖ్య రాళ్ల(602వ ర్యాంకు), దీపక్‌ సింగ్‌(606వ ర్యాంకు), దరిపెల్లి రమేశ్‌(630వ ర్యాంకు), ఫణి కిరణ్‌(638వ ర్యాంకు), దీరజ్‌కుమార్‌(768వ ర్యాంకు), మీనా(768వ ర్యాంకు) సాధించారన్నారు. 

హిమాయత్‌నగర్‌లోని బ్రెయిన్‌ ట్రీ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందిన ఎస్‌.రుషికేశ్‌ రెడ్డి (95వ ర్యాంకు), జి.చందీష్‌ (198వ ర్యాంకు), వి.తేజా దీపక్‌ (279వ ర్యాంకు), వైవీఆర్‌ఎస్‌ శేఖర్‌ (539 ర్యాంకు), కె.ప్రతిమ (757వ ర్యాంకు) సాధించారని ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ గోపాల కృష్ణ తెలిపారు.

అశోక్‌నగర్‌లోని సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమికి చెందిన ఎంవీ సత్యసాయి కార్తిక్‌(103వ ర్యాంకు), ప్రేమ్‌ సాగర్‌ (170వ ర్యాంకు) సాధించినట్లు అకాడమీ నిర్వాహకురాలు బాలలత తెలిపారు.


logo