మంగళవారం 20 అక్టోబర్ 2020
Hyderabad - Sep 18, 2020 , 02:27:48

పేదలను ఆదుకోవడానికే సంక్షేమ పథకాలు

పేదలను ఆదుకోవడానికే సంక్షేమ పథకాలు

 డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌

సికింద్రాబాద్‌ : ఆడపిల్లల వివాహాలు తల్లితండ్రులకు భారం కాకుండా ఉండేందుకు షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి  కేసీఆర్‌కే దక్కుతుందనీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ అన్నారు. నామాలగుండులోని కార్యాలయంలో రూ. 51లక్షల విలువచేసే 52 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి.. అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల కోసం దళారులను ఆశ్రయించవద్దన్నారు. నామాలగుండులోని ఎమ్మెల్యే కార్యాలయంలో సంప్రదించాలని, కార్యాలయంలో ప్రజలకు అవసరమైన సేవలు అందించడానికి ఉదయం పదింటి నుంచి సాయంత్రం ఏడింటి వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు తీగుళ్ల  రామేశ్వర్‌గౌడ్‌, సుంకు రాంచందర్‌,  కార్పొరేటర్‌ సామలహేమ పాల్గొన్నారు.

భవనాలను పరిశీలించిన డిప్యూటీ స్పీకర్‌ 

సీతాఫల్‌మండిలో నిర్మాణంలో ఉన్న కేసీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌, మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌, సెట్విన్‌ బిల్డింగ్‌ ప్రాంగణాలను డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ గురువారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసుల కార్యదర్శి సవ్యసాచి ఘోష్‌, సెట్విన్‌ మేనేజర్‌ వేణుగోపాల్‌,  కార్పొరేటర్‌ హేమ, టీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు తీగుళ్ల రామేశ్వర్‌గౌడ్‌, సుంకు రాంచందర్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo