e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home హైదరాబాద్‌ సంక్షేమ ఫలం.. పాలన సుగమం

సంక్షేమ ఫలం.. పాలన సుగమం

సంక్షేమ ఫలం.. పాలన సుగమం
  • ఆత్మగౌరవంతో జీవిస్తున్న వృద్ధులు, వికలాంగులు
  • కొత్త మున్సిపాల్టీలు.. కార్పొరేషన్లతో ముగింట్లోకి పాలన
  • ధీమాను నింపుతున్న రైతు బీమా.. రైతు బంధు

తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంలో ప్రవేశపెట్టిన ఆసరా పథకం లక్షలాది మందికి భరోసానిస్తున్నది. స్వరాష్ట్ర సాధన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ వెంటనే ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు రూ.1500, ఇతర కేటగిరీల వారికి రూ.వెయ్యి చొప్పున పింఛన్లను అందించగా, రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ మొత్తాన్ని రూ.3016, రూ.2016 చేసి ప్రతి నెల నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తు న్నారు. అదే
విధంగా వృద్ధుల పింఛన్‌ వయో పరిమితిని 60 నుంచి 57 ఏండ్లకు కుదించారు. దీంతో లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతున్నది. సర్కారు అందిస్తున్న పింఛన్‌ ద్వారా వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా ఆపత్కాలంలో వారికి ఆసరాగా నిలుస్తున్నది.

తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల్లోనే కాదు పరిపాలనలోనూ విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఏడేండ్ల స్వల్ప కాలంలో అనేక చర్యలు చేపట్టింది. మొదటిసారి అధికారంలోకి వచ్చిన అనంతరం కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలను ఏర్పాటు చేసిన సర్కారు.. రెండో దఫా అధికారంలోకి వచ్చాక కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. దీంతో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని ప్రజలకు దూరభారం తప్పడంతో పాటు ప్రభుత్వ పాలన చేరువైంది. అదీగాక మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల చుట్టూ తిరగకుండానే అంతా ఆన్‌లైన్‌లోనే పనులు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. ఇంటి నిర్మాణ అనుమతులు మొదలు తదితర పత్రాలను డిజిటల్‌ ద్వారానే జారీ చేస్తున్నది. దీంతో సేవలు పారదర్శకంగా, వేగవంతంగా సాగు తూ పురప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నది.

రైతుబంధు, బీమాతో ధీమా..

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందజేయడంతో పాటు, రైతు ఏ కారణంతోనైనా మృతి చెందితే అతడి కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు బీమా కింద రూ.5 లక్షలను అందజేస్తున్నది. మొదటిసారి అధికారంలోకి వచ్చిన తరువాత రైతుబంధు కింద రూ.4వేల సాయం అందించగా, రెండో దఫా అధికారంలోకి వచ్చాక ఆ మొత్తాన్ని రూ.5 వేలకు పెంచింది. ఆ డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లోనే వేస్తుండడం విశేషం.

మేడ్చల్‌ జిల్లా

రెతుబంధు- 30,666 రైతులు (రూ.33.14కోట్లు)
రైతుబీమా- 33 మంది (1.65 కోట్లు)
కొత్త మున్సిపాలిటీలు – (మేడ్చల్‌, తూంకుంట, నాగరం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్‌కేసర్‌, గుండ్ల పోచంపల్లి, కొంపల్లి, దుండిగల్‌)
కార్పొరేషన్లు – జవహర్‌నగర్‌, బోడప్పల్‌, పీర్జాదిగూడ, నిజాంపేట్‌

రంగారెడ్డి జిల్లా

రైతుబంధు- 3.09 లక్షల మంది (రూ.371 కోట్లు)
రైతుబీమా – 804 మంది (40.20కోట్లు)
కొత్త మున్సిపాల్టీలు.. 5 (ఆదిభట్ల, తుర్కయాంజల్‌, ఆమనగల్‌, కొత్తూరు, శంకర్‌పల్లి)
కార్పొరేషన్లు 3 (బడంగ్‌పేట్‌, బండ్లగూడ, మీర్‌పేట్‌ జిల్లెలగూడ)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సంక్షేమ ఫలం.. పాలన సుగమం

ట్రెండింగ్‌

Advertisement