బుధవారం 30 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 06, 2020 , 00:38:18

ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం

 ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం

- ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి   - తన జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్యే 

ఉప్పల్‌జోన్‌, ఆగస్టు 5 : ఉప్పల్‌ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో మరింత ముందుకు సాగుతూ అభివృద్ధిని వేగవంతం చేస్తామన్నారు. ఉప్పల్‌కు ఐటీని తీసుకురావడంలో కీలకభూమిక పోషించిన మంత్రి కేటీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. ఉప్పల్‌ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపడానికి నిరంతరం శ్రమిస్తామన్నారు. ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఉప్పల్‌ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొని, కేక్‌ కట్‌ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ బేతి స్వప్నారెడ్డి, టీఎం బీఎస్‌ఆర్‌ వ్యవస్థాపకుడు బేతి సుమంత్‌రెడ్డి, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గడ్డం రవికుమార్‌, తవిడబోయిన గిరిబాబు, మేకల మధుసూదన్‌రెడ్డి, లేతాకుల రఘుపతిరెడ్డి, బన్నాల ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు. 


logo