e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home హైదరాబాద్‌ రూపాయి ఖర్చు లేకుండా.. లక్ష మొక్కల సంరక్షణ

రూపాయి ఖర్చు లేకుండా.. లక్ష మొక్కల సంరక్షణ

రూపాయి ఖర్చు లేకుండా.. లక్ష మొక్కల సంరక్షణ
  • వెస్ట్‌ జోన్‌ పరిధిలో తొలి సోలార్‌  ఆధారిత నర్సరీ
  • సౌరశక్తితోనే నీటి సరఫరా
  • నగరంలో ఇదే ప్రథమం….

మియాపూర్‌ , మార్చి 5: సహజ వనరులను ఎంత చక్కగా వాడుకుంటే అంత అద్భుతాలు స్పష్టించవచ్చు. ఆర్థికంగా కూడా మేలే.   శేరిలింగంపల్లి జోనల్‌ అధికారులు ఇదే పని చేశారు. సోలార్‌ పవర్‌తో రోజు వారీ విద్యుత్‌ ఖర్చును గణనీయంగా తగ్గించుకున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా వంద నర్సరీలు నెలకొల్పాలని సంకల్పించగా, అందులో భాగంగా ఒకటి ఐఏఎస్‌కాలనీలో ఏర్పాటైంది. ఇక్కడి మొక్కలకు నీటి అందించేందుకు సౌరశక్తిని ఉపయోగించుకొని.. బల్దియాకు విద్యుత్‌ వ్యయ్యాన్ని సగానికి సగం తగ్గించగలిగారు. దీనికి తోడు నెలవారీగా వచ్చే బిల్లులకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. తొలిదశగా చేసిన ఈ ప్రయత్నం.. మిగిలిన నర్సరీల్లోనూ సాధ్యాసాధ్యాలను బట్టి  ఇదే తరహా విధానం అవలంబించాలని నిర్ణయించారు.  

రూ. 6 లక్షల నుంచి 7 లక్షల వరకు.. 

జోన్‌ పరిధిలోని ఐఏఎస్‌ కాలనీ నర్సరీలో లక్ష మొక్కలను ఏర్పాటు చేస్తున్నారు. బయోడైవర్సిటీ అధికారిణి నీరజ నేతృత్వంలో ఇందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ నర్సరీలో మొక్కలను కాపాడుకునేందుకు అవసరమైన విద్యుత్‌ వ్యవస్థ కోసం సుమారు రూ. 10 లక్షల వరకు వ్యయం అవుతున్నట్లు అంచనా వేశారు.  కిలోమీటర్‌ దూరం నుంచి సుమారు 25 వరకు స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్‌తో సహా ఇతర పరికరాలకు ఖర్చు పెట్టడం కన్నా.. సౌరశక్తిని వినియోగించాలని  జోనల్‌ కమిషనర్‌ సంకల్పించారు. అనుకున్నదే తడువుగా టెండర్‌ ప్రక్రియను పూర్తి చేయించారు. అలా.. గరిష్ఠంగా  కేవలం రూ. 4 లక్షల వ్యయంతో సోలార్‌ పలకలను, ఇతర సాంకేతిక పరికరాలు నర్సరీలో ఏర్పాటయ్యాయి. సుమారు రూ. 6 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు అధికారులు వ్యయం తగ్గించగలిగారు. అలాగే ఈ  నర్సరీకి నెలనెలా వచ్చే విద్యుత్‌ బిల్లుల సమస్య లేకుండా పోయింది. 

మూడు కిలో వాట్ల సామర్థ్యంతో.. 

మూడు కిలో వాట్ల సామర్థ్యం కలిగిన ఈ సోలార్‌ పవర్‌తో సమీపంలోని ఖాజాగూడ లేక్‌ నుంచి మొక్కల సంరక్షణకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా, నర్సరీ చుట్టూ  అందమైన లైటింగ్‌ను సైతం  ఏర్పాటు చేస్తున్నారు. ఈ నర్సరీ స్ఫూర్తిగా మరికొన్ని నర్సరీలకు సైతం సోలార్‌ పవర్‌ను వినియోగించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. కాగా, కరెంటు బిల్లుల భారం లేకుండా సహజ విద్యుత్‌ వినినియోగానికి  శ్రీకారం చుట్టిన ఇక్కడి అధికారులను బల్దియా ఉన్నతాధికారులు సైతం అభినందించారు.

సోలార్‌ పవర్‌తోనే నీటి సరఫరా

ఈ నర్సరీలో లక్ష మొక్కలను ఏర్పాటు చేస్తున్నాం. సౌర విద్యుత్‌తో వీటి రక్షణకు కావాల్సిన నీటిని ఖాజాగూడ లేక్‌ నుంచి తీసుకుంటాం. దీని వల్ల నెల వారీ విద్యుత్‌ బిల్లుల భారం నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. జోన్‌ పరిధిలో ఇదే తొలి సోలార్‌ పవర్‌తో నడిచే నర్సరీ.  ఈ ప్రయత్నాన్ని మరికొన్ని నర్సరీలకు విస్తరించే యోచనలో ఉన్నాం. సోలార్‌ పవర్‌ వ్యవస్థ ఏర్పాటు ద్వారా సాధారణ విద్యుత్‌ ఏర్పాటుకు అయ్యే వ్యయంలో 60 శాతం వరకు తగ్గించగలిగాం. -నాగళ్ల రవికిరణ్‌, జోనల్‌ కమిషనర్‌, వెస్ట్‌ జోన్‌ శేరిలింగంపల్లి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రూపాయి ఖర్చు లేకుండా.. లక్ష మొక్కల సంరక్షణ

ట్రెండింగ్‌

Advertisement